తెలంగాణ

నదులు నిండుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 12: గోదారమ్మ శాంతించింది. గత నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో వరద ఉద్ధృతికి గోదారమ్మ ఉరకలేసింది. దీంతో ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర్‌ఘాట్, మంగపేట పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహించింది. లోతట్టు గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాంనగర్ లోలెవల్ వంతెనపై వరద ప్రవాహం చేరడంతో రాంనగర్, లంబాడితండా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళవారం గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ లోలెవల్ వంతెనపై ఇంకా వరద కొనసాగుతుండడంతో రాంనగర్ శివారులోని పెద్దమ్మకట్ట కల్వర్టు పైనుండి గోదావరి ప్రవాహంతో రాంనగర్, లంబాడితండా వాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు లోతట్టు గ్రామాల ప్రజల సౌకర్యార్థం నాటుపడవలు ఏర్పాటు చేశారు. వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. అయితే సాయంత్రం వరకు క్రమక్రమంగా గోదావరి వరద ఉద్ధృతి తగ్గి నిలకడగా ఉంది. దీంతో గోదావరి సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా బాబ్లీగేట్‌లను ఎత్తివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు నిలకడగా ఉన్న గోదారమ్మ మరోసారి ఉద్ధృతంగా ప్రవహించే అవకాశాలు కూడా లేకపోలేదు.