తెలంగాణ

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: నీటి పారుదల ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతించాల్సిందిగా స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి లేఖ రాయనున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీయం కెసిఆర్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చినప్పుడు తమకూ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఏ సభ్యుడైనా ప్రైవేటు బిల్లు పెట్టేందుకు నియమ, నిబంధనలు ఎలా ఉన్నాయో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కూ అదే రూల్ వర్తిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రవీంద్ర భారతిలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటామంటే ఆ హాలు ఇచ్చేందుకు నిరాకరించారని విమర్శించారు. ప్రైవేటు ఫంక్షన్ హాలులో నిర్వహించడం బాగుండదని, అసెంబ్లీలో నిర్వహిస్తేనే మంత్రులు, అధికార పక్షంతో సహా, ప్రతిపక్షాలన్నీ చూసేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు. తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన తప్పుడు లెక్కలను బయటపెడతామన్నారు.
తనకో జిల్లా.. కొడుక్కో జిల్లా..
సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల సంఖ్య పెంచే అంశాన్ని ‘తెర’పైకి తెచ్చారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. నాకో జిల్లా, నా కుమారునికో జిల్లా, నా మనవడికో జిల్లా అనే రీతిలో పంచుకుంటున్నారే తప్ప శాస్ర్తియంగా చేపట్టడం లేదని అన్నారు. అయినా దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి చర్చించలేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు మంచిదే కానీ ప్రతిపక్షాల అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఇలాఉండగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 30న రైతు గర్జన నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈనెల 24న పెద్దపల్లిలో పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెలలోనే ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టే విషయాన్ని ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం చేపట్టగానే నాగార్జున సాగర్ ఎండిపోయిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.
టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి