తెలంగాణ

అంకితభావంతో సేవ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, రోగులకు డాక్టర్లు అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆమె 2019-20 బ్యాచ్ ఇఎస్‌ఐసీ వైద్య విద్యార్థుల చేత హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె, హిమాచల్ ప్రదేశ్ బండారు దత్తాత్రేయ ప్రతిభను కనపరిచిన 19 మంది వైద్య విద్యార్థులకు బంగారు పతకాలు, ధృవీకరణ పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ఇఎస్‌ఐసీ మెడికల్ కాలేజీనని తక్కువ కాలంలోనే ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారన్నారు. రోగుల పట్ల శ్రద్ధగా ఉండాలని, వారి సమస్యలను సావధానంగా వినాలని కోరారు. ఎంతో నమ్మకంతో తమ బాధను వైద్యులకు రోగులు చెప్పుకుంటారని, వారి పట్ల మానవతా దృక్పథంతో ఉండాలని ఆమె కోరారు. 2016 నుంచి ఇఎన్‌ఐసీ మెడికల్ కాలేజీ ప్రాంగణం ప్లాస్టిక్ రహితంగా ఉండడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని, ఈ విషయమై వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు కాలేజీలో నేర్చుకున్న అమూల్యమైన అంశాలను గుర్తు పెట్టుకుని నిజ జీవితంలో రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. వైద్యులు ప్రతి రోజూ వైద్య పరిశోధనల గురించి అధ్యయనం చేయాలని, ఆధునిక వైద్య పద్ధతులను ఆకళింపు చేసుకోవాలన్నారు. ఇఎన్‌ఐసీ మెడికల్ కాలేజీని నాలుగు సంవత్సరాల్లో అగ్రశ్రేణి వైద్య సంస్థగా మార్చడానికి డీన్ శ్రీనివాస్ చేసిన కృషిని ప్రశంసించారు.
అబ్బాయిల కంటే అమ్మాయిలు ప్రతిభను కనపరచడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమ్మాయిలు వైద్య వృత్తిలో బాగా రాణిస్తారని ఆయన ఆకాంక్షించారు. ఇఎస్‌ఐసీ ఆర్థిక కమిషనర్ సంధ్యా శుక్లా కాలేజీ ప్రగతిపై నివేదిక సమర్పించారు.