జాతీయ వార్తలు

కొలీజియంకు జడ్జీల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశవాప్తంగా హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి 223 పేర్లను కొలీజియంకు సిఫార్సు చేశారు. 15 హైకోర్టులు ఈ మేరకు జాబితాను సుప్రీం కోర్టు కొలీజియంకు పంపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, అలహాబాద్, కర్నాటక, రాజస్థాన్, గౌహతి, బాంబే హైకోర్టులు జాబితాలను పంపాయి. అభ్యర్థుల సర్వీసు ప్రాతిపదికగా నియామకాలు ఉంటాయి. అలాగే ఇంటిలిజెన్స్ నివేదికల ప్రకారం జాబితాను రూపొందించిన కొలిజియంకు అందజేయడం అనవాయితీ. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి తుది నిర్ణయం సుప్రీం కోర్టు కొలీజియం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయా రాష్ట్రాల హైకోర్టులు సిఫార్సు చేసిన జాబితా వడపోత తరువాత కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. దేశంలోని 24 హైకోర్టుల్లో 470 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరికి 443 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా తాజాగా ఆ సంఖ్య 470కి చేరుకుంది. 2015 విషయానికి వస్తే 392 ఖాళీలు ఉండేవి. పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఖాళీగా సంఖ్య పెరుగూ వచ్చింది. కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ అందజేసిన వివరాల ప్రకారం 2016 జూలై 1 నాటికి మొత్తం ఖాళీల సంఖ్య 470. అలహాబాద్ హైకోర్టు పరిధిలోనే అత్యధికంగా 82 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కులాల తొలగింపు
కేసు వాయిదా
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూలై 12: తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలిగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. దీనిపై కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను ధర్మాసనం ఆదేశించింది. కళింగ, శెట్టిబలిజ, గవరతో సహా ఇరవై ఆరు కులాల వారు తెలంగాణలో లేరంటూ బీసీ జాబితా నుంచి ఆ సామాజిక వర్గాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం 3, 16 జీవోలను గతంలో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తు జాబితా నుండి తొలగించిన కులాలు హైకోర్టు ఆశ్రయించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తొలగించబడిన కులాలు, విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
నేడు ఎమ్సెట్ -2 ఫలితాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 12: తెలంగాణ ప్రభుత్వం ఈనెల 9న నిర్వహించిన ఎమ్సెట్-2 ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఎమ్సెట్-2కు 56,188 మంది దరఖాస్తు చేయగా, ఆంధ్రా, తెలంగాణ కలిపి 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం పరీక్ష తొలి కీ విడుదల చేశారు. దానిపై విద్యార్ధుల నుండి 12వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించారు. పెద్దగా అభ్యంతరాలు రాకపోవడంతో 13వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
పట్టాలెక్కిన రైలు
విజయవాడ-్ధర్మవరం మధ్య ట్రై వీక్లీ రైలు
ఢిల్లీలో పచ్చజెండా ఊపిన కేంద్ర మంత్రులు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూలై 12: విజయవాడ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరాన్ని కలుపుతూ ఏర్పాటైన కొత్త రైలు మంగళవారం ప్రారంభమైంది. ఢిల్లీలో రైల్వే మంత్రిత్వశాఖ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రులు సురేశ్ ప్రభు, మనోజ్ సిన్హా మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి విజయవాడలో రైలును ప్రారంభించారు. వారంలో మూడు రోజలపాటు ఈ రైలు నడుస్తుంది. ధర్మవరంలో ఉదయం బయలుదేరే ఈ రైలు విజయవాడ చేరుకుని తిరిగి సాయంత్రానికి ధర్మవరం వెడుతుంది. గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపురం స్టేషన్లలో రైలు ఆగుతుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లావాసులకు ఈ కొత్త సర్వీసువల్ల ఎంతో ప్రయోజనం. ఆంధ్రప్రదేశ్‌కు మరో రైలు రావడం పట్ల మంత్రి సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. కొత్త రైల్వే జోన్ గురించి చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ధర్మవరం రైలును ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. దీంతోపాటు హర్యానా, గుర్గావ్ నుంచి బెంగళూరు సమీపంలో నిద్‌వాండ వరకు సరుకులు రవాణా చేసే ప్రత్యేక కార్గో రైలును ప్రారంభించారు.్ధర్మవరం-విజయవాడ రైలును ప్రారంభించిన సందర్భంగా విజయవాడ స్టేషన్‌లో కోలాహలం నెలకొంది. గుంటూరు రైల్వే స్టేషన్‌లో అధికారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎంపి కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. పెద్దయెత్తున ప్రజలు కూడా స్టేషన్‌కు చేరుకుని రైలు రాకను వీక్షించారు.