తెలంగాణ

ప్రామాణిక విద్యకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అట్టడుగున ఉన్న పాఠశాల విద్యకు సొబగులు దిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్ కార్తీక్ సేవలను వినియోగించుకుని ప్రామాణిక విద్యకు, జిల్లాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు అవగాహన ఒప్పందం కుర్చుకుంది. జిల్లాల్లో విద్యా ప్రమాణాల స్థాయి, ప్రతి విద్యార్థి వికాసం, కౌశలాలను అధ్యయనం చేసి విశే్లషించేందుకు శాస్ర్తియ పరిశోధనకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 142ను జారీ చేసింది. ఇందుకోసం జమీల్ అబ్దుల్ లతీఫ్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ సేవలను వినియోగించుకోనుంది. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనుంది. వివిధ జిల్లాల్లో అభ్యసన ఫలితాల గురించి స్వతంత్రంగా నాణ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. వీటి ఆధారంగా లక్ష్యాత్మకంగా ఫలితాలను సాధించడంపై దృష్టి పెడతారు. జేపీఎఎల్ పక్షాన వివిధ విద్యాకార్యక్రమాలపై పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా సహాయ సహకారాలు అందిస్తారు. అనుకోకుండా జేపీఏఎల్ వ్యవస్థాకుడు ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ ఆయన సతీమణి ఈస్తర్ దఫ్లో దంపతులకు ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించడం కాకతాళీయమని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ నోబెల్ బహుమతి గ్రహీతలైన ఈ ఇరువురితో కలిసి పనిచేశారని , మూడో నోబెల్ గ్రహీత మైఖైల్ క్రీమర్ వద్ద పీహెచ్‌డీ చేశారని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బీ జనార్ధనరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో నాణ్యత కోసం కట్టుబడి ఉందని తెలిపారు.