తెలంగాణ

సుగంధ ద్రవ్యాల పంటలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: సుగంధ ద్రవ్యాల పంటలను వేసేందుకు ముందుకు వచ్చే రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘సుగంధ ద్రవ్యాల సాగు-ఆవశ్యకత’ అంశంపై మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి రైతు అవగాహనా సదస్సులో మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. సుగంధ ద్రవ్యాలైన జీలకర్ర, సోంపు, వాము సాగును ప్రోత్సహించేందుకు సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద 2019-20 సంవత్సరంలో రైతులకు చెందిన వంద ఎకరాల్లో ప్రదర్శనా క్షేత్రాలను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. ఉద్యాన శాఖ నర్సరీల్లో కూడా ఈ పంటల ప్రదర్శన క్షేత్రాతలను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన విత్తనాలను అజ్మీర్‌లోని జాతీయ సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం (ఎన్‌ఆర్‌సీఎస్‌ఎస్) నుండి తెప్పిస్తామన్నారు. రోజూ మనం వాడే ఆహార పదార్థాలలో సుగంధ ద్రవ్య పంటలైన పసుపు, మిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, మెంతులు మొదలైన వాటికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. ఇవి ఆరోగ్యానికి మేలురకమైన విటమిన్లు, ఖనిజాలు, ఆంటీ యాక్సిడెంట్స్‌ను అందిస్తాయని మంత్రి తెలిపారు.
సుగంధ ద్రవ్యాల పంటలలో 17 రకాల విత్తన సుగంధ ద్రవ్య పంటలు ఉన్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఏటా 2.31 లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాలు అవసరం అవుతాయని అంచనావేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పసుపు, ఎండుమిర్చి దిగుబడులు రాష్ట్ర అవసరాలకు మించి ఉన్నాయని, ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, వాము తదితర పంటలను ఇక్కడి రైతులు పండించకపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈ పరిస్థితిలోనే రైతుల్లో అవగాహన కల్పించి, సుగంధ ద్రవ్యాల విస్తీర్ణం 1.15 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రణాళిక రూపొందించామన్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని, విత్తనాలను అందిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.
ఈ కారక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి, అజ్మీర్‌లోని ఎన్‌ఆర్‌సీఎస్‌ఎస్ డైరెక్టర్ గోపాల్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాల నుండి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు.