తెలంగాణ

హుజూర్‌నగర్‌లో గెలుపునకు అధికార దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: హుజూర్‌నగర్ అసెంబ్లీలో గెలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎన్నికల ఖర్చు పరిధిని దాటేశారన్నారు. కేటీఆర్ రోడ్‌షో వెయ్యి వాహనాలతో జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి చొరవ చూపకుండా ప్రజలను తీవ్ర ఇక్కట్లపాలు చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యా సంస్థల సెలవులను పొడిగించడం వల్ల సమస్య ఎలా పరిష్కారమవుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంకారం వల్లనే సమ్మె కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ ఆస్తులను అధికారంలోని పెద్దలు లీజుల పేరుతో కాజేస్తున్నారనే వార్తలు వస్తున్నాయన్నారు.
ఆర్టీసీకి అప్పులు స్వల్పంగా ఉంటే, ఆస్తులు వేల కోట్లలో ఉన్నాయన్నారు. ఈ వేల కోట్ల రూపాయల ఆస్తులను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆర్టీసీ అప్పుల్లోకి నెట్టబడిందన్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీల ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం జమ చేయలేదన్నారు. ఆర్టీసీ నుంచి ప్రయోజనం పోందిన ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.