రాష్ట్రీయం

సముద్రంలోకి ఐదువేల టీఎంసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: గోదావరి, కృష్ణా నదుల ద్వారా బంగాళాఖాతంలో దాదాపు ఐదు వేల టీఎంసీలకుపైగా జలాలు వృథాగా కలిశాయి. ఈ ఏడాది జూలై మొదటి వారం వరకు అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలతో కృష్ణా నదిపైన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలతో పాటు ఇతర రిజర్వాయర్లు నిండాయి. గోదావరి నది కూడా గత రెండు నెలలుగా వరదలతో పొటెత్తుతున్న సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్ల అంచనా ప్రకారం ఇంతవరకు గోదావరి నది ద్వారా దాదాపు 4000 టీఎంసీ జలాలు, కృష్ణా నది ద్వారా దాదాపు 1000 టీఎంసీకి పైగా జలాలు సముద్రంలో కలిశాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నది ద్వారా ఎక్కువగా జలాలను సాగునీటి అవసరాల నిమిత్తం వాడుతున్నారు. గత రెండు నెలల్లో రికార్డు స్థాయిలో ఆరు సార్లు శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి జలాలను దిగువున ఉన్న సముద్రంలోకి వదిలారు. శ్రీశైలం ద్వారా 1375 టీఎంసీ జలాలు ప్రవహించాయి. రికార్డు స్థాయిలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వరద నీరు కృష్ణా నదిలో ప్రవహిస్తోంది. ఇటీవల కాలంలో 2005-06లో, 2008-09 సంవత్సరంలో వరద నీటి ఉధృతి రికార్డయింది. అలాగే శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా ఈ నెల 12వ తేదీ వరకు 1818 ఎంయూ విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. వరద నీరు ఎక్కువ రోజులు ప్రవహించడం వల్ల తెలంగాణలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. వచ్చే వేసవిలో నీటి ఎద్దడి ఉండదని, పుష్కలంగా జలాలు లభిస్తాయని ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్పారు.