తెలంగాణ

ప్రజాసంఘాలపై నిషేధం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: ప్రజాసంఘాలను నిషేధిస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ విడుదల చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. చట్టపరిధిలో ఉద్యమాలు, పోరాటాలు, భావస్వేచ్ఛ వ్యక్తీకరించడానికి ప్రతి పౌరుడికీ హక్కులు ఉన్నాయని, అయితే కమిషనర్ ప్రత్యేక నిఘా ఉంచి విచారణ జరుపుతామని ప్రకటించారని అన్నారు. ఈ అంశం మరింత గందరగోళానికి దారితీస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి చట్టంలోనే వెసులుబాటు కల్పించారని, కమిషనర్ ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం తమ వైఖరి ఏమిటో తెలియజేయాలని సీపీఐ డిమాండ్ చేసినట్టు ఆయన చెప్పారు.
ఆర్టీసీని విలీనం చేయాలి
గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని, ఆర్టీసీని విలీనం చేయాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎన్ జ్యోతి కోరారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎఐవైఎఫ్ నేతలు మంగళవారం నాడు బస్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలి ఉల్లా ఖాద్రీ, మరుపాక అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధిలేకుండా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తోందని వారు ఆరోపించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు బాసటగా ఈ నెల 19న నిర్వహించే రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు వారు చెప్పారు.
హెచ్‌ఏఎల్ కార్మికుల సమ్మెకు మద్దతు
ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగిన పద్ధతిలోనే వేతన ఒప్పందం చేయాలని కోరుతూ హెచ్‌ఏఎల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ఎఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ తెలిపారు. ఒకే రోజు దేశంలో ఉన్న ఆరు పరిశ్రమల్లో పనిచేస్తున్న సుమారు 20వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని ఆయన చెప్పారు.
*చిత్రం... సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి