తెలంగాణ

సమ్మె ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజు మంగళవారం మరింత ఉధృతంగా కొనసాగింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్టవ్య్రాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు, ఆందోళనలు, రాస్తారాకోలకు ఉద్యమాన్ని మరింత హోరెత్తించారు. హైదరాబాద్‌లో బస్ భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులతో పాటు వామపక్షాల పార్టీల కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు ప్రయత్నించాయి. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అర్టెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు, ఆందోళనకారులకు మ ధ్య తోపులాటలు, వాగ్వాదాలు చో టు చేసుకున్నాయి. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్టీసీ కార్మికుల కు మద్దతుగా స్థానిక డిపో ఎదుట జరిగిన ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లో బీజేపీ ఎంపీ బండి సంజ య్ ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొనగా అతన్ని కూడా అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సూర్యాపేట జి ల్లా కేంద్రంలో జరిగిన ఆర్టీసీ ఆం దోళనలో పాల్గొన్నారు. హైదరాబా ద్ నగరంలోని అన్ని డిపోల ఎదు ట జరిగిన ఆందోళన కార్యక్రమా లు విజయవంతమయ్యాయి. ప్ర భుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్థంగా ఉందన్న సంకేతాన్ని ఇవ్వడంతో కార్మికులు మరింత ఉత్సాహంతో ఆందోళన కార్యక్రమాలను హోరెత్తించారు.

*చిత్రాలు.. హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంగళవారం జరిగిన ర్యాలీ, నిరసన ప్రదర్శన