తెలంగాణ

ఉద్యమ నేతే ఉద్యమాన్ని అణచివేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, అక్టోబర్ 15: ఉద్యమ నాయకుడే ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నించడం ఘోరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. సికింద్రాబాద్ జూబ్లీబస్ స్టేషన్‌లో కంటోనె్మంట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మంగళవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఆయన హాజరై సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకే కార్మికులు పోరాటం చేస్తున్నారని, వారివి న్యాయమైన కోర్కెలేనని, వాటిని తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. కానీ బాధ్యతను మరిచిన ముఖ్యమంత్రి చాలా అన్యాయంగా, దుర్మార్గంగా, నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది తగదని హితవు ఆయన పలికారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. ఆ బాధ్యతను మరిచి, కెనడాలో మాదిరిగా కార్మికుల సమ్మెను అణచివేస్తామని, అవసరమైతే కాల్పులు జరపడానికైనా వెనుకాడమని హెచ్చరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. కార్మిక సంఘాలు నాయకులతో కూడా చర్చలకు సీఎం సిద్ధంగా లేకపోవడం పట్ల ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే చర్చలు జరిపి, కార్మికుల సమస్యలను పరిష్కరించి ప్రజారవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపిన నేత, ఇంతటి దుర్మార్గపు ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళనను అణచివేయాలని చూడడం తగదని సూచించారు. సీఎం కేసీఆర్ రహస్య అజెండా పెట్టుకుని ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తే, గతంలో చంద్రబాబు, వైఎస్సాఆర్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఆయన హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం నాయకులు డీజీ నర్సింహారావు, అజయ్‌బాబు, ఆర్.మల్లేశ్, ఓయూ విద్యార్థి నాయకులు మహిపాల్ యాదవ్ ఉన్నారు.

ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొన్న సీపీఎం నేత బీవీ రాఘవులు