తెలంగాణ

వంద శాతం బస్సులు తిప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: సమ్మె ప్రభావంతో ప్రజారవాణాకు ఇబ్బందులు లేకుండా వందశాతం ఆర్టీసీ బస్‌లు తిప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ డిపోల మేనేజర్లకు సూచించారు. గత 11 రోజులుగా సమ్మె జరుగుతుంటే రవాణా కోసం బస్‌లను ఎందకు పూర్తిస్థాయిలో తిప్పడంలేదని డీఎంలను మంత్రి నిలదీశారు. బుధవారం తెలంగాణలోని అన్ని డిపోల మేనేజర్లతో వీడియో కార్ఫరెన్సలో మంత్రి మాట్లాడారు. సిబ్మంది నియామకాల కోసం డిపో మేనేజర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా ఎందకు నియమించలేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. గురువారం నుంచి రాష్ట్రంలో వంతదశాతం బస్‌లు తిప్పాల్సిందేనని ఆయన హుకుం జారీ చేశారు. సిబ్బంది కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే అర్హులైన అభ్యర్థలు రావడంలేదని డీఎంలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చదువుకున్న యువతీ, యువకులు భారీగా వస్తున్న వారికి అనుభవం లేకపోవడంతో దరఖాస్తులను తీసుకోలేకపోతున్నామని డీఎంలు నిస్సహాయత వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వందశాతం బస్‌లు తిప్పాలని ప్రకటనలు చేస్తుస్తుంటే అధికారులు కొర్వీలతో సిబ్బందని నియమించకపోవడం ఆందోళన కల్గిస్తోందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం తమకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో దాదాపు 6365 బస్‌లు తిప్పామని, సిబ్బంది కూడా 6385 హాజరు అయ్యారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే మంత్రి అసంతృని వ్యక్తం చేశారు.