తెలంగాణ

సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు ఉపాధ్యాయు సంఘాల జేఏసీ సంఘీభావంగా నిలుస్తుందని ఆయా సంఘాల నేతలు ప్రకటించారు. బుధవారం ఎస్‌టీయు భవన్‌లో జరిన సమావేశంలో జెఎసీటీవో, యుఎస్‌పీసీ రాష్ట్ర కమిటీలు ఉమ్మడి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమ్మెకు సంఘీభావంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. సమ్మెకు మద్దతుగా ఆయా సంఘాలు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈనెల 17న జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలన్నారు. 18న సమ్మెకు బాసటగా సమావేశలు నిర్వహించాలన్నారు. 19 రాష్ట్ర బంద్‌కు మద్దతు ప్రకటిసుస్తున్నట్లు తెలిపారు. సెలవుల తర్వాత స్కూల్ తెరచిన రోజున ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్నాం భోజన సమయం విరామ సమయంలో నిరసనలు చేపట్టాలని వారు సూచించారు. కమిటీ ఇచ్చిన పిలుపును ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేయాలని హైదరాబాద్ జిల్లా స్టీరింగ్ కమిటీ సూచించింది.