తెలంగాణ

టీఆర్‌టీ, పీఈటీల ప్రగతిభవన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: టీఆర్టీ పీఈటీ ఫలితాలను ప్రకటించి నియామకాలు అన్నీ పూర్తి చేయాలని కోరుతూ జాక్టో యూఎస్‌పీసీ నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ డిమాండ్‌ను తక్షణమై ఆమోదించాలని కోరుతూ టీఆర్టీ పీఈటీ అభ్యర్ధులు బుధవారం నాడు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. నేతలు అందర్నీ పోలీసులు అరెస్టు వారిని గోషామహల్‌కు తరలించారు. టీఆర్టీ అభ్యర్ధులను కలిసేందుకు వెళ్లిన జాక్టో, యుఎస్‌పీసీ నేతలను పోలీసులు అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాక్టో యూఎస్‌పీసీ నేతలు జీ సదానందం గౌడ్, చావా రవి, ఇ రఘునందన్, డీ రాజయ్య, వై అశోక్‌కుమార్, మైస శ్రీనివాస్, ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుండి టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో చైర్మన్‌ను, సభ్యులను, కార్యదర్శినీ కలవడానికి వెళ్లగా ఎవరూ అందుబాటులో లేరని పేర్కొన్నారు. సర్వీసు కమిషన్ కార్యాలయం వద్ద నేతలు పీఈటీ అసోసియేషన్ నాయకులు సోమేశ్వరరావు, బాలరాజులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
కోర్టులో ఉంది: సర్వీసు కమిషన్
పీఈటీ పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీసు కమిషన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అయితే ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కీ విషయంలో హైకోర్టులో కేసు నడుస్తోందని సర్వీసు కమిషన్ కార్యదర్శి ఏ వాణీ ప్రసాద్ వివరించారు. 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్ 56 ప్రకారం రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతోందని హైకోర్టులో రిట్‌పిటిషన్ 21571/2019 దాఖలైందని ఆమె చెప్పారు. అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన పనే్లదని, కోర్టు నుండి ఆదేశాలు రాగానే తదనుగుణమైన చర్యలను చేపడతామని కార్యదర్శి వివరించారు.
*చిత్రం...ప్రగతిభవన్‌ను ముట్టడించిన టీఆర్‌టీ, పీఈటీలు