తెలంగాణ

సంక్షేమ పథకాల ద్వారానే సామాజిక న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో ఎస్సీ, మైనారిటీ శాఖలు చేపట్టిన వివిధ పథకాలపై సమీక్షించారు. ప్రజల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా వివిధ సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. విదేశాల్లో చదువుకోసం ప్రభుత్వం నుండి సాయం పొందిన వారి నుండి అభిప్రాయాలు సేకరించి, విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల మరింత మంది విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకునేందుకు వీలవుతుందన్నారు. విద్యావంతులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కార్పోరేషన్ల ద్వారా ఆర్థిక సాయం చేస్తోందని, ఈ సాయం అవసరమైన వారంతా ఉపయోగించుకునేలా చూడాలన్నారు. ఈ స్వయం ఉపాధి పథకాలను సమీక్షించేందుకు త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలోప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, ఎస్సీ డెవలప్‌మెంట్ డైరెక్టర్ కరుణాకర్, మైనారిటీ సంక్షేమం డైరెక్టర్ షానవాజ్ ఖాసీ, గురుకుల విద్యాలయాల కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, షఫీయుల్లా తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... అధికారులతో చర్చిస్తున్న మంత్రి ఈశ్వర్