తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ జోక్యం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర గవర్నర్ స్పందించడం భేష్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి హనుమంతరావు ప్రశంసించారు. గత గవర్నర్ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగిన స్పందించలేదని విమర్శించారు. గవర్నర్ స్పందించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం మంచిది కాదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం విహెచ్ మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఇంగా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఇంకా జీతాలు చెల్లించలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. టీఆర్‌ఎస్ నేతలు కూడా సీఎం కేసీఆర్ వైఖరి పట్ల అసహనంతో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడితే ఉన్న ఉద్యోగాలను తీసేయాలని సీఎం చూస్తున్నారని విహెచ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంఘాలు ఉన్నప్పుడు కార్మికులకు ఎందుకు ఉండరాదని ఆయన ప్రశ్నించారు.
ఇంకా స్పందించకపోవడం ఘోరమన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్‌రెడ్డిల పాలన నియంతల పాలనగా కొనసాగుతుందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలో మీడియాకు స్వేచ్ఛ లేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను తాగుబోతుల రాష్ట్రాలుగా మార్చుతున్నారని విహెచ్ ధ్వజమెత్తారు.