రాష్ట్రీయం

‘మీడియా డాన్’ల సృష్టికర్త బాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: తన రాజకీయ ప్రత్యర్థులను అభాసుపాలు చేయడానికి ‘మీడియా డాన్‌లను’ సృష్టించేది ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడేనని వైకాపా సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం చంద్రబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛకు ఏపీ ప్రభుత్వం భంగం కలిగిస్తోందని, హక్కులను హరిస్తోందని చెప్పడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాపై ఆంక్షలా అంటూ చంద్రబాబు చెప్పడం వింతగా ఉందన్నారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు వస్తే జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు అధికారం కట్టబెట్టిన జీవోలను ఆయన మీడియాకు చూపించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై విచ్చలవిడిగా అసత్య ప్రచారాలతో బాబు బినామీ మీడియా దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక విధంగా, అధికారం కోల్పోతే మరో రకంగా వ్యవహరించడం అలవాటుగా ఉందన్నారు. చంద్రబాబు ఆలోచన అంతా అధికారం నిలుపుకోవడానికి దేనికైనా దిగజారుతారన్నారు. ప్రభుత్వాన్ని రక్షించుకోవల్సిన బాధ్యత వైకాపాకు ఉందన్నారు. అందుకే ప్రభుత్వంపైన, జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ కార్యదర్శులకు అధికారం కట్టబెట్టామని ఆయన స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం పత్రికలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, జీవోలను ప్రభుత్వం జారీ చేయలేదన్నారు. వైఎస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి బాటలో ముళ్లు పరుస్తూ పోతుంటే వారిని కట్టడి చేయాల్సిన అవసరం వైకాపాకు ఉందన్నారు. చంద్రబాబు బినామీ మీడియా రాసే వార్తలపై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని రామచంద్రయ్య నొక్కి చెప్పారు. చంద్రబాబు బినామీ మీడియా ఏపీ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేయడం పట్ల ఆయన హేళన చేశారు. అధికారం పోయిన తర్వాత చంద్రబాబుకు పిచ్చిపట్టి ఇష్టానుసారం మాట్లాడడాన్ని ఆంధ్రా సమాజం గమనిస్తోందని అన్నారు. జర్నలిస్టుల విలువలపై చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వివిధ సంఘటనలకు సంబంధించిన వాస్తవాలను ఏనాడైనా బాబు బినామీ మీడియా ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వంపై చీటికీమాటికి అభాండాలు వేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు బినామీ మీడియాను కచ్చితంగా నిలువరిస్తామన్నారు. మీడియా ముసుగులోకి చొరబడ్డ కొందరు పచ్చ వ్యక్తులు చంద్రబాబు తాబేదార్లేనని ఆయన కనె్నర్ర చేశారు. ఒక పత్రికకు కొమ్ముకాస్తూ, అధికార వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు రాయడం జర్నలిజమా అంటూ ఆయన నిలదీశారు. చంద్రబాబు రోజూ మీడియా ముందుకు వచ్చి జగన్మోహనరెడ్డి పాలన ఎలా చేస్తారో చూస్తానని హెచ్చరించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఢిల్లీలో టీడీపీ నేతలు ఎన్‌హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేస్తే బాబు మీడియా మొదటి పేజీలో వార్తలు రాయడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు అప్రజాస్వామిక పాలనపై ప్రజాస్వామికవాదులు గొంతెత్తితే వాటికి సంబంధించిన వార్తలు రాశారా అంటూ ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు పతనానికి ఎల్లో మీడియా కారణమని ఆంధ్రా సమాజం గుర్తు చేస్తోందన్నారు. సాధ్యంకాని పథకాలు అమలు చేస్తానని చెప్పడాన్ని తెలుగు ప్రజలు తిరస్కరించారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కులవైషమ్యాలు, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టింది పచ్చ మీడియా కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు పట్టిన చెదపురుగుగా పచ్చ మీడియాను ఆయన దుయ్యబట్టారు. పత్రికా స్వేచ్ఛను బతికించడానికి వైకాపా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.