తెలంగాణ

బంద్‌తో సీఎం దిమ్మతిరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ దిమ్మతిరగాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయకుండా అణచివేసేందుకు కుట్రలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మె 14వ రోజు విజయవంతంగా కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి. ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి సమ్మెల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. రేవంత్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆర్టీసీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని మరచి సొంత లాభం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసేందుకు ప్రయత్నించడం విచారకరమన్నారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను పడిందన్నారు. రూ.85 వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకోవాలని ప్రయత్నిస్తుంటే 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు దాన్ని తిప్పికొట్టేందుకు సమ్మె బాటపట్టారన్నారు. వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపాలన్నారు. కోర్టు సూచనలను పాటించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు.
ఆర్టీసీ కార్మికులు ఆధైర్యపడొద్దన్నారు. ప్రభుత్వం మెడలు వంచి సమస్యలను సాధించుకుందామని, కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 19న చేపట్టిన తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.
బంద్‌కు అన్ని రాజకీయ పార్టీల మద్దతు
ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించిన తెలంగాణ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయ. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన తదితర రాజకీయ పార్టీలు అనుబంధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. 12సమాజ హితానికి కృషి చేయండి