తెలంగాణ

కొత్త కానిస్టేబుళ్లకు మంత్రి హరీష్ హితవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 18 : నూతనంగా పోలీసు ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరు మంచి సమాజాన్ని నిర్మించేందుకు ఆదర్శంగా నిలువాలని మేము ఇచ్చిన శిక్షణ మీ శ్రమ, పట్టుదలతోనే పోలీసు ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు అన్నా రు. సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్‌లో పోలీసు ఉచితశిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ పొందిన అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, సీపీ జోయల్ డేవిస్‌తో కలసి మంత్రి హరీష్‌రావు సన్మానించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఉద్యోగ సాధనకై పడిన కష్టం, పట్టుదలనే లక్ష్యాన్ని సాధించాయన్నారు. ఉద్యోగాలను సాధించాలని తపన ఉన్న యువతలో స్పూర్తిని నింపారని కొనియాడారు.
మీకు ఉద్యోగాలు లభించటం వల్ల నిజమైన సంతృప్తి లభించిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జీవితంలో పదిమందికి ఉపయోగపడితేనే నిజమైన సంతృప్తి ఉంటుందన్నారు. పోలీసు ఉద్యోగాల సాధనకు హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ ఇన్సిట్యూట్ భాగ్యకిరణ్ శిక్షణ ఇవ్వటంతోనే భాగ్యరేఖ మారిందన్నారు.