తెలంగాణ

ఓటిస్తే..అభివృద్ధినిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, అక్టోబర్ 18: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేస్తే.. అభివృద్ధి చేసి చూపెట్టే బాధ్యత తనదని రాష్ట్ర గిరిజన, స్ర్తి శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆమె శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా నేరేడుచర్ల మండలంలోని బావోజితండా, రోళ్లవారిగూడెం, నేరేడుచర్లలో ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రైబల్ ఉప ప్రణాళిక నుంచి గిరిజన తండాల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. తండాలకు రహదారులు, డబుల్‌బెడ్‌రూంలు ఇప్పిస్తానన్నారు. నియోజకవర్గంలోని గిరిజనతండాలు, కారు గుర్తుకు ఓటు వేస్తామని తీర్మానాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదన్నారు. పిల్లలులేరని చెప్తున్న దంపతులు ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారం అవసరం లేదని స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు చేయవచ్చన్నారు. కాంగ్రెస్‌పార్టీ గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైందని, ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తే వృథా అవుతుందన్నారు. పద్మావతికి ఓటు వేస్తే ఉత్తమ్ కుటుంబానికే లాభమన్నారు.
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధుసూదన్, టీడీపీ నాయకులు వల్లంశెట్ల రమేష్‌బాబు, ఆకుల జగతయ్య, శ్రీనునాయక్ పాల్గొన్నారు.