తెలంగాణ

మరింత ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఉత్తర్వుల ప్రతులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇనచార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని, సమ్మె నోటీసులు ఇచ్చిన డిమాండ్లలో సగం వరకు ఆర్థికేతర అంశాలు, న్యాయబద్ధమేనని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అలాగే కార్మికులతో చర్చల ప్రక్రియ ప్రారంభించి మూడు రోజులలో పరిష్కారం కనుగొనాలని కూడా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించాలా? లేదా? అనే అంశంపై అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి చర్చించారు. చర్చల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించడంతో పాటు సమ్మె విరమించి చర్చలు జరపాలని కూడా
కార్మిక సంఘాలను హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించక పోవడంతో చర్చల ప్రక్రియ ఎలా జరపాలని హైకోర్టునే తిరిగి కోరాలని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం. ఆర్టీసీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లు తీర్చలేని స్థితిలో ఉన్న విషయాన్ని కూడా కోర్టుకు నివేదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో కోర్టుకు సమాచారం కూడా ఇవ్వాలని ఆదేశించడంతో కోర్టుకు సమర్పించే నివేదికపై సీఎం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఇలా ఉండగా విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు ముగియనుండడం, సోమవారం నుంచి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా బస్సులను పూర్తిస్థాయిలో నడిపించాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మను సీఎం ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి ఆదివారం నాటికి 6,537 బస్సులను నడిపినట్టు రవాణా శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అద్దె బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా కలిపి వందకు వంద శాతం సర్వీసులను సోమవారం నుంచి ప్రారంభం కావాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు రవాణా శాఖ అధికార వర్గాల సమాచారం.