తెలంగాణ

రాజ్యాంగ సంక్షోభం రాకముందే.. కేసీఆర్ కళ్లు తెరవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 20: ఆర్టీసీ సమ్మెపై రాజ్యాంగ సంక్షోభం తలెత్తకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని హన్మకొండ ఏకశిల పార్కులో కొనసాగుతున్న ఆర్టీసీ దీక్షా శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీ సమ్మె 15 రోజులు గడిచినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై కొత్తగా వచ్చిన గవర్నర్‌కు ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేకపోవడం పట్ల ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కారణంగా తలెత్తుతున్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ది నయా నిజాం పాలన కొనసాగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ్యంలో ఆర్టీసీ కార్మికులను కరివెపాకులాగా వాడుకొని ఇప్పుడు ఆ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్టీసీ ఆస్తులపై కన్ను పడిందని, ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఆర్మూర్‌లో ఆర్టీసీ ఆస్తులను వారి సంబంధికులకు దారదత్తం చేశారన్నారు. ఇప్పటికే ఆర్టీసీ స్థలాల్లో 115 పెట్రోల్ బంకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారన్నారు. అందులో ఒకే వ్యక్తికి 54 బంకులు అప్పగించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఒక పథకం ప్రకారమే ఆర్టీసీ సమ్మెను పరిష్కారం కాకుండా చేస్తున్న కేసీఆర్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకేనని అన్నారు. ఉద్యమంలో లేనివాళ్లంతా మంత్రులు కావడం వల్లే సమస్య తలెత్తుతుందన్నారు. ఉద్యమం నాటి మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ ఆర్టీసీ సమ్మెపై నోరువిప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌లోకి రాకముందు ఆర్టీసీ కార్మికుల పక్షాన మాట్లాడిన మాటలు, మంత్రి పదవి చేపట్టినాక చెప్తున్న మాటలు దానిని స్పష్టం చేస్తున్నాయన్నారు. కేసీఆర్‌కు అధికారం తలకెక్కిందని ఆయన మండిపడ్డారు. ఆయన ఇప్పటి వరకు అణచిపెట్టిన దొరతనం ఒక్కసారిగా బయటకు వచ్చిందన్నార. అందుకే 15 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హైకోర్టు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చలనం లేదన్నారు. కార్మికులతో చర్చలు జరపకుండా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఆరేళ్లలోనే అప్పుల తెలంగాణగా చేశారన్నారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తిగా అండగా ఉంటుందని, కార్మికులెవరూ ఆధైర్య పడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం మెడలు వంచి కార్మికుల డిమాండ్లు సాధించే వరకు పోరాటం కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపి రాష్ట్ర నాయకులు డాక్టర్ టీ.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, రావుపద్మ, రేవూరి ప్రకాష్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...ఆర్టీసీ దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్