తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల జీతాలకు డబ్బుల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరో మూడు కొత్త పిటిషన్లు సోమవారం నాడు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాల జాక్ నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై ఈ నెల 29న తదుపరి విచారణ జరగనుంది. ఆర్టీసీ సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలు తమ ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని ఆర్టీసీ జాక్ నేతలు నిర్ణయించారు. వేతనాల అంశంపై హైకోర్టులో విచారణకు వచ్చినపుడు ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్‌ను దాఖలు చేసింది. ఆర్టీసీ సిబ్బందికీ, కార్మికులకు వేతనాలకు 239 కోట్లు అవసరమని, కానీ కార్పొరేషన్ వద్ద 7.49 కోట్లు మాత్రమే నిధులు ఉన్నాయని కార్పొరేషన్ తరఫున అడ్వకేట్ జనరల్ వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత కార్మికులకు 67 శాతం వేతనాలు పెంచామని అన్నారు. ఏటా 900 కోట్ల రూపాయిలు ఆర్థిక భారంతో 2015 జూన్‌లో 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని రవాణా కార్యదర్శి సునీల్‌శర్మ కౌంటర్‌లో వివరించారు. 200 కోట్ల ఆర్థిక భారం ఉన్నా 2018 జూలైలో 16 శాతం మధ్యంతర భృతిని ఇచ్చామని పేర్కొన్నారు. ఆర్టీసీకి 4,882 కోట్ల వార్షిక ఆదాయం ఉండగా, ఖర్చు మాత్రం 5,811 కోట్లు ఉంటోందని అన్నారు. పైగా ప్రతి నెలా జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. ఆర్టీసీకి 4,709 కోట్లు
అప్పులు ఉండగా, ఉద్యోగుల పీఎఫ్, ఈఎల్, సీసీఎస్ బకాయిలు 1,660 కోట్లు ఉన్నాయని, కార్మిక శాఖ వద్ద చర్చలు ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే చట్టవిరుద్ధంగా కార్మికులు సమ్మెకు వెళ్లారని అన్నారు. కార్పొరేషన్ బలోపేతానికి చర్యలు చేపడతామని ప్రభుత్వం నచ్చచెప్పినా సమ్మెకు దిగడంతో సామాన్య ప్రయాణికులకూ తీరని అసౌకర్యం కలిగిందని అన్నారు. సమ్మెతో దసరా సీజన్‌లోనే సంస్థకు 125 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రభుత్వ వాదనలు రికార్డు చేసిన హైకోర్టు ఇంతవరకూ కార్మికులు చేసిన పనికి వేతనం చెల్లించకుండా ఎలా ఆపేస్తారు అంటూ ప్రశ్నించింది. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జీతాలు చెల్లించకపోవడం వల్లనే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జాక్ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు.