తెలంగాణ

ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రాష్ట్ర కమిటీ నేతలు సోమవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్నంగా వీహెచ్‌పీ నేతలతో తమిళిసై మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు సభ్యత, సంస్కారం ఉన్నవారని, వారి మంచికోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల అభివృద్ధికోసం పనిచేయాలని ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు గవర్నర్ తమిళిసైని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో విహెచ్‌పీ అఖిలభారత సంపర్క్ ప్రముఖ్ రాజ్‌బిహారీ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామరాజు, బండారి రమేష్, నేతలు జగదీశ్వర్‌జీ, వెంకటేశ్వరరాజు, చంద్రశేఖర్, బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్, కో-కన్వీనర్ సుభాష్ చందర్, శివరాములు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...గవర్నర్‌ను కలిసిన వీహెచ్‌పీ నేతలు