తెలంగాణ

బోసిపోయిన బడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ సమ్మెతో సెలవుల పొడిగింపు అనంతరం సోమవారం నాడు పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు పున:ప్రారంభం అయినా చాలా వరకూ స్కూళ్లలో టీచర్లు, ఇతర బోధన సిబ్బంది హాజరుకాకపోవడంతో అవి బోసిపోయాయి.
అనేక సమస్యల మధ్య తిరిగి విద్యాసంస్థలు పున:ప్రారంభం అయ్యాయి. ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ప్రత్యక్షంగా ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు పలుకుతూ సమ్మెలోనూ, ఇతర నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నా విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మరో పక్క జాక్టో సహా పలు ఉపాధ్యాయ సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికాయి.
దసరా సెలవుల అనంతరం 8వ తేదీన స్కూళ్లు ప్రారంభం అయినా, అప్పటికే ఆర్టీసీ సమ్మె ప్రారంభం కావడంతో స్కూళ్ల బస్సులు, ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రభుత్వం విద్యార్థులకు అసౌకర్యం కలుగరాదని 19వ తేదీ వరకూ సెలవులను పొడిగించింది.
ఒక దశలో గత వారమే ఆర్టీసీ సమ్మెకు ఫుల్‌స్టాప్ పడుతుందని, బస్సులు యథావిధిగా తిరుగుతాయని అంతా భావించారు. అయితే అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఇరువర్గాలూ సిగపట్లకు దిగడంతో వ్యవహారం ముదిరి సమ్మె కాస్తా బంద్ వరకూ వెళ్లింది. ప్రభుత్వం చర్చలకు తావు లేదని ప్రకటించడంతో కొత్త కార్యాచరణ ప్రణాళికను ఆర్టీసీ జాక్ , రాజకీయ పార్టీలతో కలిసి ప్రకటించింది. సమ్మె ముగియకముందే స్కూళ్లు 21న ప్రారంభం అయ్యాయి.
ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు, ప్రభుత్వ సూచన మేరకు కొన్ని ప్రైవేటు వాహనాలను, విద్యాసంస్థల బస్సులను తాత్కాలిక సిబ్బంది సహకారంతో నడుతుపున్నారు. దాంతో విద్యాసంస్థల బస్సులు కూడా విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయా యి. సీబీఎస్‌ఈ సహా వివిధ బోర్డులు ఇంకో పక్క 1 నుండి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
దీంతో విద్యార్థులకు ఆర్టీసీ సమ్మె పెద్ద తలనొప్పిగా తయారైంది.
పరీక్ష ఫీజు గడువు పెంపు
టెన్త్ పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్టు పరీక్షల బోర్డు డైరెక్టర్ బి సధాకర్ తెలిపారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా నవంబర్ ఏడో తేదీ వరకూ విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చని, 50 రూపాయిలు అదనపు రుసుంతో నవంబర్ 23 వరకూ, 200 రూపాయిలు అదనపు రుసుంతో డిసెంబర్ 10 వరకూ, 500 రూపాయిలు అదనపు రుసుంతో డిసెంబర్ 23 వరకూ ఫీజులు చెల్లించవచ్చని ఆయన వివరించారు.