తెలంగాణ

నోటిఫికేషన్‌కు సర్కార్ సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ వ్యవహారాల మంత్రి కే తారకరామారావు ఒకటి రెండు రోజుల్లో సంబంధిత అధికారులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుండి వివరాలు తెప్పించుకుంది. వార్డు ల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలపై ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 మున్సిపల్ కార్పొరేషన్లు (జీహెచ్‌ఎంసీతో సహా), 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించేందుకు వీలులేని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను వదిలివేసి మిగతా వాటి కి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం గా ఉంది. హైకోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లకు సంబంధించి ప్రభుత్వం అన్ని వివరాలు కోర్టుకు సమర్పించింది. దాంతో సంతృప్తి చెందిన కోర్టు ఎన్నికలు
నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. హైకోర్టు తీర్పు కాపీపై సంబంధిత ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, డైరెక్టర్ టీ.కే. శ్రీదేవి తదితరులతో మంత్రి కేటీఆర్ బుధవారం లేక గురువారం చర్చిస్తారని తెలిసిం ది. అధికారులతో జరిగే సమగ్ర చర్చల తర్వాత వార్డుల విభజన, చైర్‌పర్సన్లు, వార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం అందించే అవకాశమున్నట్టు తెలుస్తోం ది. వివరాలు అందిన తర్వాత ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధికి మంగళవారం రాత్రి చెప్పారు.