తెలంగాణ

గిరిజన వర్సిటీ కోసం కేంద్రంతో మాట్లాడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో ఆమె రాజ్‌భవన్‌లో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం కావలసి ఉందని, గిరిజనులపై ఉన్న అభిమానంతో తాను త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో ఈ అంశంపై చర్చిస్తానని తెలిపారు. గిరిజన యువత పరిశ్రమల వైపు వెళ్లేందుకు సహకారం అందించాలని ఆమె సూచించారు. గిరిజన ప్రాంతాల్లో అత్యంత విలువైన ఔషధ మొక్కలు ఉంటాయని, అవి కేవలం గిరిజనులకే తెలుస్తుందని, ఔషధ మొక్కల విలువను సమాజానికి తెలిపేందుకు డాక్యుమెంటరీని రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని గిరిజన ప్రాంతాలను త్వరలో సందర్శిస్తానని గవర్నర్ ప్రకటించారు. ‘గిరిజనుల సమస్యలు, వారి సంస్కృతీ సంప్రదాయాలను నేరుగా తెలుసుకునేందుకు వీలును బట్టి ఒక గిరిజన గూడేనికి వెళతాను..ఒక రాత్రి వారితో గడుపుతా’ అని తమిళిసై వెల్లడించారు.
గిరిజనుల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు గిరిజన సంక్షేమ శాఖ తరఫున అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టామని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బి. మహేష్ దత్ ఎక్కా తెలిపారు. గవర్నర్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేశామని, 2.25 లక్షల మంది గిరిజన విద్యార్థులు వివిధ విద్యాసంస్థలలో చదువుకుంటున్నారని వివరించారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు తదితర ప్రముఖ విద్యాసంస్థలలో చదుకుకునేందుకు గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. సివిల్ సర్వీసుల పరీక్షలకు కూడా గిరిజన యువత హారజవుతున్నారని, ఇద్దరు విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అయ్యారన్నారు.
సమావేశానికి ముందు గవర్నర్ తమిళిసై గిరిజనులతో కలిసి నాట్యం చేశారు. భద్రాచలం నుండి వచ్చిన ఆదివాసీలు, నాగర్‌కర్నూలు నుండి వచ్చిన లంబాడాలతో కలిసి ఆమె డ్యాన్స్‌లో పాల్గొన్నారు. గవర్నర్‌తో కలిసిన గిరిజనులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము రాజ్‌భవన్‌కు రావడం ఇదే ప్రథమమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ తదితర అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... రాజ్‌భవన్‌లో మంగళవారం గిరిజన మహిళలతో కలసి నృత్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై