తెలంగాణ

సాగర్‌కు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 22: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పెరుగుతుండటంతో మంగళవారం నాగార్జునసాగర్‌లో రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో సాగర్ డ్యాం క్రస్టు గేట్లను మూసివేశారు.
కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో సైతం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే సాగర్ జలాశయం పూర్తిస్ధాయి నీటిమట్టంతో ఉండడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 22.5 లక్షల క్యూసెక్కులకుపైగా వచ్చి చేరుకుంటుంది. దీంతో శ్రీశైలం నుండి సాగర్‌కు భారీగా నీటి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా నాగార్జునసాగర్‌లో డ్యాం క్రస్టు గేట్లను మరికొన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 71,510 క్యూసెక్కులు వస్తుండగా కుడి కాల్వ ద్వారా 69,079 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,374 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,986 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు 2 క్రస్టు గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 30వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 2,55,729 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా ప్రస్తుతం 883.60 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 589.90 అడుగులుగా ఉంది.