తెలంగాణ

రాయపట్నం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 14: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధానిస్తున్న రాయపట్నం లోలెవల్ బ్రిడ్జి అంచులను తాకుతూ గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి 9.30 గంటల నుండి వంతెన పైనుండి రాకపోకలను నిలిపి వేశారు. వంతెన వద్ద నీటి మట్టం పెరుగుతున్న సమాచారాన్ని అందుకున్న ధర్మపురి, లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సిహెచ్ శ్రీనివాస్, ఎర్ర మోహన్, నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాత్రి 9 గంటల నుండి బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించారు. కడెం ప్రాజెక్టు నుండి లీకేజిల వల్ల వస్తున్న స్వల్ప నీటికి తోడు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల రాయపట్నం వంతెన అంచును తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. గురువారం రాత్రిలోగా వంతెన పూర్తిగా మునుగుతుందేమోనన్న అనుమా నంతో వాహనాలను గూడెం, రాయపట్నం బ్రిడ్జికి ఇరువైపులా నిలిపి వేయడంతో మధ్య రాకపోకలకు మళ్ళీ అంతరాయం కలిగింది.