తెలంగాణ

ఈసారి ‘వట్టెం’ వంతు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 14: పాలమూరు ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్న వివిధ గ్రామాల ముంపు బాధితులు గురువారం మహబూబ్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. తాము భూములు ఇవ్వబోమని కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్మించతలపెట్టిన వట్టెం రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న పోతిరెడ్డిపల్లి, వెంకయపల్లి, కారుకొండ, అనకపల్లితండా, కారుకొండతండా, వట్టెం గ్రామస్థులు వందలాది మంది కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహబూబ్‌నగర్‌కు తరలివచ్చారు. ముందుగా టిటిడి కళ్యాణ మండపం సమీపంలో గల ధర్నా చౌక్‌కు చేరుకున్న బాధితులు ధర్నాకు దిగి తమ భూములను ఇవ్వబోమని, అయతే, అధికారులు తమతో బలవంతంగా 123 జిఓ ప్రకారంగా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని, వాటిని తమకు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వట్టెం రిజర్వాయర్‌ను నిర్మించాలనుకుంటే తమతో 2013 భూసేకరణ చట్టంపై అవగాహన కల్పించాలని లేనిపక్షంలో 123 జిఓ ప్రకారంగా భూములు ఇవ్వబోమని ఖరాఖండిగా ధర్నాలో బాధితులు తేల్చిచెప్పారు. అనంతరం వట్టెం రిజర్వాయర్ ముంపు భాదితులు కలెక్టరేట్‌ను ముట్టడించి తమ డిమాండ్లను కలెక్టర్‌కు నేరుగా విన్నవించుకోవాలని ర్యాలీగా బయలుదేరారు. ఇంతలోపే పోలీసులు రంగంలోకి దిగారు. ర్యాలీకి అనుమతి లేదని వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. దింతో పోలీసులకు నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఓ పక్క ప్రభుత్వం తమను ముంచేస్తుంటే మరోపక్క పోలీసులు తమను అధికారులను కలవకుండా అడ్డుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వట్టెం నిర్వాసితులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. నిర్వాసితులు వినకపోవడంతో తప్పనిపరిస్థితుల్లో పోలీసులు నిర్వాసితుల్లో ఐదుగురిని కలెక్టర్ కార్యాలయానికి పోలీసులే స్వయంగా తీసుకుని వెళ్లారు. అనంతరం డిఆర్‌ఓ భాస్కర్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. నిర్వాసితులు డిఆర్‌ఓ భాస్కర్‌కు అందించిన వినతిపత్రంలో తమ భూములను అధికారులు బలవంతంగా లాకుంటున్నారని మా నుండి ధర నిర్ణయించకుండా ఖాళీ బాండ్లపై సంతకాలు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆమలు చేస్తున్న 123 జిఓ ప్రకారంగా భూసేకరణను నిలిపివేయాలని అధికారులు బలవంతంగా చేస్తే తాము ఎంతటికైనా తెగిస్తామని విఆర్‌ఓను హెచ్చరించారు. గ్రామపంచాయతీలో సభ ఏర్పాటు చేయాలని కోరారు. పూర్తిగా ముంపులో భూములు, ఇళ్లు కొల్పోతున్న తమ కుటుంబాలకు ముందుగానే ఆవాసం కల్పించాకే తమ భూముల్లోకి రావాలని అప్పుడే తాము ఓ నిర్ణయానికి వస్తామన్నారు. లేనిపక్షంలో గ్రామాలను ఖాళీ చేయబోమని ముందుగా అధికారులు తమ గ్రామాలకు వచ్చి తమతో చర్చించాలని డిమాండ్ చేశారు.
కాగా, పాలమూరు ఎత్తిపోతల పథకంలో నిర్మించబోతున్న కర్వెన రిజర్వాయర్ ముంపు బాధితులు రోడ్డుపైకి రావడం భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పడం, ఏకంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో జిల్లా అధికారులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే ఓవైపు సిఎం సొంత జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై రగడ కొనసాగుతుండగా మహబూబ్‌నగర్ జిల్లాలో కర్వెన రిజర్వాయర్ నిర్వాసితులు కూడా రోడ్డుపైకి రావడం అధికార పార్టీ నేతలతో పాటు అధికార యంత్రాంగం అయోమయానికి గురవుతున్నారు.

చిత్రాలు.. భూములు ఇవ్వబోమని మహబూబ్‌నగర్‌లో కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ర్యాలీగా వస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం కర్వెన రిజర్వాయర్
ముంపు గ్రామాల ప్రజలు... కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకుంటున్న పోలీసులు