తెలంగాణ

జోనల్ విధానానికి మంగళం? తెలంగాణ సర్కారు యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో జోనల్ విధానానికి మంగళం పాడనున్నట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో తలెత్తే ప్రధానమైన సమస్యలు, ఉద్యోగుల కేటాయింపు వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. 1969లో తెలంగాణ ఉద్యమం తరువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగాలు ఇతర ప్రాంతాల వారు పొందకుండా జోనల్ విధానం ఏర్పాటు చేశారు. దేశంలో ఉమ్మడి రాష్ట్రంలోనే జోనల్ విధానం అమలులో ఉంది. విభజన తరువాత ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల్లోనూ జోనల్ విధానం అమలవుతోంది. తెలంగాణ ఉద్యోగాలను తప్పుదోవలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు పొందుతున్నారు అనే ఉద్దేశంతోనే జోనల్ విధానం ప్రవేశపెట్టారని, ఇప్పుడు రాష్ట్రామే విడిపోయిన తరువాత జోనల్ విధానం అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు అంశంపై చర్చించిన సందర్భంగా జోనల్ విధానంపై సైతం ఉన్నత స్థాయిలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఉద్యోగుల కేటాయింపులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జోనల్ విధానాన్ని తొలగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
దసరా నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ దిశగా అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జనగామ, గద్వాల వంటి ఒకటి రెండు చోట్ల మాత్రమే కొత్త జిల్లాల ఏర్పాటుపై కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక అంతిమంగా అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని తుది కసరత్తు ముమ్మరం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో అప్పటికి అవసరం అయిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసే విధంగా అధికారులతో సమావేశాలు జరుగుతున్నాయని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల వివరాలే తప్ప ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఎంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏయే విభాగాల్లో ఉన్నారో స్పష్టమైన లెక్కలు లేవు. జిల్లాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల కేటాయింపు సమయంలో ఇలాంటి వివరాలు సైతం సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం రెండేసి జిల్లాల్లో ఉంది. 2019లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఒక నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉంటుందని అప్పటి వరకు ఇలాంటి సమస్యలు తప్పవని అధికారులు తెలిపారు.