తెలంగాణ

హరిత హారానికి మేము సైతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్‌లు ఒక నెల వేతనాన్ని హరిత హారం కార్యక్రమం అమలు కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా మున్సిపల్ ఉద్యోగులు సైతం ఒక రోజు వేతనాన్ని హరిత హారంకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు కెటిఆర్ తెలిపారు. ఈనెల 18న మున్సిపాలిటీల్లో హరిత హారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తారు. 18న సంగారెడ్డిలో జరిగే హరిత హారంలో తాను పాల్గొంటానని చెప్పారు. మంత్రి కెటిఆర్ శుక్రవారం సచివాలయం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 18న ఒకే రోజు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 18లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు గ్రీన్ ఫెన్సింగ్ కంటే ఉత్తమ మార్గం లేదని అన్నారు. ప్రభుత్వ స్థలాల చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు.
చెట్టు బొట్టు
మున్సిపాలిటీల్లోని స్వయం సహాయక సంఘాలతో చెట్టు- బొట్టు కార్యక్రమం చేపట్టనున్నట్టు సిడిఎంఎ దానకిశోర్ తెలిపారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి హరిత లక్ష్మి (మొక్కను)ని అందిస్తారని చెప్పారు. మొక్కల పెంపకంలో విజయం సాధించిన మహిళా సంఘాలకు, ఎన్‌జివోలకు, వ్యక్తులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా వారింటికి, కార్యాలయానికి వెళ్లి తానే స్వయంగా సన్మానిస్తానని కెటిఆర్ తెలిపారు. హరిత హారం లక్ష్యాలను సాధించిన మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వనున్నట్టు కెటిఆర్ తెలిపారు. హరిత హారం కోసం మున్సిపల్ శాఖ తరఫున పది కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
హైదరాబాద్‌లో ఇక వైట్‌టాపింగ్ రోడ్లు!
హైదరాబాద్ నగరంలో త్వరలోనే వైట్ టాపింగ్ రోడ్లను నిర్మించనున్నారు. ప్రస్తుత రోడ్లకు బదులు ఎక్కువ కాలం ఉండే విధంగా వైట్ టాపింగ్ రోడ్లు నిర్మిస్తారు. ఒకసారి వైట్ టాపింగ్ రోడ్లను వేస్తే పదిహేను సంవత్సరాల పాటు ఉంటాయి. హైదరాబాద్ నగరంలో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణ అంశంపై సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్‌తో తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు శుక్రవారం సమావేశం అయ్యారు. నగరంలో వైట్ టాపింగ్ రోడ్లను వేసే ముందు జిహెచ్‌ఎంసి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. రోడ్లతో పాటు కేబులింగ్ కోసం డక్ట్ ఏర్పాటు, సీవరేజ్ లైన్ల విషయంలో జిహెచ్‌ఎంసి రూపొందించుకోవలసిన ప్రణాళికపై చర్చించారు. వైట్ టాపింగ్ రోడ్ల టెక్నాలజీ, నగరానికి సరిపోయే టెక్నాలజీపై కెటిఆర్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైట్ టాపింగ్ రోడ్ల అంశంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు త్వరలోనే ఒక సమావేశం నిర్వహిస్తారని కెటిఆర్ తెలిపారు. వైట్ టాపింగ్ రోడ్ల పనుల కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సిబ్బందితో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ తెలిపింది.
రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విషయం పరిశీలించాలని, దీని వల్ల వ్యయం తగ్గుతుందని చెప్పారు. వివిధ నగరాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన వైట్ టాంపింగ్ రోడ్ల నిర్మాణ పనులను ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం, ప్రణాళికల కోసం రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లు, జిహెచ్‌ఎంసి అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సచివాలయం నుంచి మేయర్లు, చైర్మన్లతో
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న తెలంగాణ మంత్రి కెటిఆర్