తెలంగాణ

వైభవంగా రామకోటి నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 15: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దే వస్థానంలో శుక్రవారం తొలి ఏకాదశి పూ జలు, రామకోటి నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించి లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం చేశారు. విష్ణుసహస్రనామ పారాయణాలు చేశారు. అనంతరం దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో రెండు వాహనాల్లో రామకోటి పుస్తకాలకు ప్రోక్షణ చేసి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. గోదావరి వంతెనపైకి తీసుకెళ్లి అక్కడ గంగా పూజలు చేశారు. గోదారమ్మకు పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు, అక్షితలు సమర్పించి శిరస్సుపై రామకోటి పుస్తకాలతో ఈఓ రమేశ్‌బాబు రామనామ స్మరణలు చేశారు. సూర్యాస్తమయం సమయంలో వాటిని నిమజ్జనం చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, కోలాటాల నడుమ రామకోటి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.