తెలంగాణ

వట్టిపోయిన జూరాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 15: గల గల గోదావరి కదులుతుంటే ...బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి...మురిపాల ముత్యాలు దొర్లుతాయి అనేది తెలుగు ప్రజలు గుర్తుంచుకునే గీతం. అయితే పరిస్థితులు తారుమారు అయిపోయాయి. ఓ పక్క గోదావరి పరుగులిడుతుంటే మరోపక్క కృష్ణమ్మ మాత్రం వట్టిపోయి పలుగురాళ్లు, ఇసుక దిబ్బలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టే తంగిడిగి మొదలుకుని సోమశీల వరకు ఎటు చూసిన కృష్ణానది ఎండిపోయి దర్శనమిస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న కృష్ణమ్మకు వరదరాకపోవడంతో కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు ఖరీఫ్ పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. మరోపక్క వచ్చే నెల ఆగస్టు 12 నుండి పవిత్రమైన పుష్కరాలు రాబోతున్నాయి. కృష్ణమ్మ పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు పుష్కరస్నానం చేయడానికి తరలిరానున్నారు. అయితే ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి రాష్ట్రంలోని కృష్ణానదికి చుక్క వరదనీరు కూడా ప్రవహించడం లేదు. ఇది ఇలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలో 32 పుష్కర ఘాట్ల పనులు మాత్రం వేగవంతంగా పుంజుకుంటున్నాయి. కృష్ణానదిపై ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 2 టిఎంసిల నీరు మాత్రమే నిలువ ఉంది. మహారాష్టల్రో గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతోనే గోదావరి తెలంగాణలో పరవళ్లు తొక్కింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో మాత్రం వరణుడు కరుణించకపోవడంతో ఆల్మట్టి గేట్లు తెరిచే స్థాయి వరకు నీరు చేరకపోవడం అదేవిధంగా నారాయణపూర్ డ్యాం పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఆల్మట్టి , నారాయణపూర్ డ్యాంలు నిండితే తప్పా. రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం కృష్ణానది మాత్రం వట్టిపోయి దర్శనమిస్తుంది. ప్రభుత్వం పుష్కరాల పనులు మాత్రం చకచకగా కొనసాగిస్తుండడం పుష్కరాల వరకు ఆల్మట్టి నుండి తప్పకుండా వరద వస్తుందనే ఆశతో జిల్లా ప్రజానీకం ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే జూరాల నుండి వరద ప్రవాహం రావల్సిందే. ఏది ఎమైనప్పటికిని వర్షాకాలం ప్రారంభమై రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసి అటు నది పరవళ్లు తొక్కుతుండడంతో కృష్ణానది పరివాహక ప్రాంతం మాత్రం కృష్ణమ్మ పరవళ్లు లేక నీటి జలకళ అందాలు ఎప్పుడెప్పుడు చూస్తామని ఈ ప్రాంత ప్రజలు కొండంత ఆశతో ఉన్నారు.