తెలంగాణ

ఇద్దరిని బలిగొన్న ‘చిట్టీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, జూలై 15: ఒకే గ్రామంలో ఒకే రోజు ఇద్దరి ఆత్మహత్య కలకలం సృష్టించింది. డబ్బుల గొడవ చినికిచినికి గాలివానైంది. దీంతో రెండు కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. పండుగపూట అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దమ్మన్నగారి యాదగిరి (36) చిట్టీలు నడుపుతుండగా ఆయన వద్ద చాకలి కరుణాకర్ (28) చిట్టీ వేసి పాడుకొన్నాడు. చిట్టీ డుబ్బులు పూర్తిగా ఇవ్వకపోవడంతో ఈనెల 14న కరుణాకర్ యాదగిరికి చెందిన ఎడ్లను కొట్టుకొనిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన యాదగిరి శుక్రవారం ఉదయం బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి వద్ద పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి చేరుకొని ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆయన మృతికి కరుణాకరే కారణమని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు శవాన్ని కరుణాకర్ ఇంటి ముందు తీసుకొచ్చారు. దీంతో భయభ్రాంతులకు గురైన కరుణాకర్ ఇంట్లోకి వెళ్ళి పురుగుల మందు తాగాడు. వెంటనే కరుణాకర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో కరుణాకర్ మృతదేహాన్ని నేరుగా తీసుకువచ్చి యాదగిరి ఇంటిముందు పెట్టి ఆందోళన చేశారు. దీంతో యాదగిరి ఇంటి ముందు రెండు మృతదేహాలు పక్కపక్కనే ఉండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇదిలా ఉండగా, ఈ సంఘటనకు కారణమని భావించిన పలువురు సర్పంచ్ యాదవరెడ్డి, జడ్పీటిసి వీరమని భర్త బూపాల్‌రెడ్డిలపై దాడి చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పొస్టుమార్టానికి తరలించవలసిందిగా కోరగా కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా శవాలను టాక్టర్‌లోకి ఎక్కించే ప్రయత్నం చేయగా కరుణాకర్ కుటుంబసభ్యులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. అయనప్పటికీ మృతదేహాలను టాక్టర్‌లో తరలిస్తుండగా పలువురు చౌరస్తా వద్ద అడ్డుకొని ట్రాక్టర్‌ను నిలిపేశారు. రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్‌ఐ పరశురాం, పిఎస్‌ఐలు రామకృష్ణ, అనీల్‌కుమార్‌రెడ్డి, ఎఎస్‌ఐ బిక్యానాయక్, కానిస్టేబుల్‌లు మదుసూదన్‌రెడ్డి, తిర్మల్‌బాబులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. కాగా, మృతుడు చాకలి కరుణాకర్‌కు భార్య మాధవి, రెండేళ్ళ కూతురు ఉండగా, యాదగిరికి భార్య లలిత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో తిర్మలాపూర్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.