తెలంగాణ

జూపల్లి గోబ్యాక్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 15: నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జోగుళాంబ అమ్మవారి పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ కొన్ని రోజులు గా ఉద్యమాలు చేస్తున్నారు. తాజా గా శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు గద్వాలకు రాగా ఆయన పర్యటనను అడ్డుకోవడంతో పాటు గోబ్యాక్ అం టూ నినాదాలు చేస్తూ జిల్లా సాధన సమితి నేతలు భారీగా నిరసనలు తెలియజేశారు. ఒకానోక సందర్భం లో పోలీసులు తీవ్రంగా శ్రమించడం తో పాటు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. శుక్రవారం ఉదయం 10.30గంటలకు మంత్రి జూపల్లి గ ద్వాలలోకి వస్తున్నారని తెలుసుకొని జిల్లా సాధన సమితి, ఐక్యకార్యచరణ వేదిక, కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నేతలు రెండవ రైల్వేగేట్ రోడ్డుపైకి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా వందలాది మంది నిరసన కారు లు రోడ్డుపైకి రావడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ముందస్తు సమాచారం ఉండడంతో పెద్దసంఖ్యలో ప్రత్యేక బలగాలను, డివిజన్‌లోని వివిధ స్టేషన్ల పోలీసులను రప్పించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉద్యమకారులతో చ ర్చలు జరిపినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులు అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు ఉద్యమకారులను బలవంతంగా రోడ్డుపై నుంచి అరెస్టు చేసి డిసిఎంలో ధరూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికి కొందరు నేతలు డిసిఎం నుంచి కిందకు దూకి మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాల ప్రారంభానికి వస్తుండగా కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్ మీదుకు వెళ్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. దీంతో డిఎస్‌పి బాలకోటి, సిఐ సురేష్‌లు లాఠీ చార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. అదేవిధంగా బిసి కాలనీలో మొక్కలు నాటేందుకు వెళ్లిన మంత్రికి ఊహించని విధంగా ఆ కాలనీకి చెందిన నాయకులు డిటిడిసి నర్సిం హ ఆధ్వర్యంలో యువకులు కాన్వయ్‌ను అడ్డుకొని వినతిపత్రం ఇచ్చేందుకు నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించి యువకులను చెదరగొట్టారు. అదేవిధంగా ధరూరు, గట్టు, మండలాల్లో కూడ ముందస్తు అరెస్టులు, పర్యటన ముగిసేంత వరకు పోలీసులు డేగ కళ్లతో ఉద్యమకారులను అడుగడుగునా అరెస్టులు చేసి పర్యటనను ముగించారు. మంత్రి జూపల్లి పర్యటన నడిగడ్డ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిందని పలువురు పోలీసులు చర్చించుకున్నారు.

రెండవ రైల్వేగేట్ సమీపంలో రోడ్డుపై బైఠాయించిన సాధన సమితి నేతలు, మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు