తెలంగాణ

హరిత రక్షణకు జల ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో నిర్వహిస్తున్న హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారని, వర్షాలు కురవని సీజన్‌లో మొక్కలను బతికించేందుకు నీరు ఏవిధంగా అందిస్తారో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సిఎం కె చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరిత హారంపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు సెక్టార్లవారీగా సూక్ష్మస్థాయి ప్రణాళిక సిద్ధం చేసి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపాలన్నారు. ప్రతి వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పరిస్థితిని సమీక్షిస్తానన్నారు. మొక్కలను బతికించడం ముఖ్యమని, జిల్లాలు, డివిజన్లలో అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్లను మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించుకోవాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీల్లో ఉన్న మంచి నీటి ట్యాంకర్లను కూడా వాడి మొక్కలకు నీరు పోయాలన్నారు. పోలీసు శాఖ కూడా మొక్కలను బతికించడం కోసం వర్షాలు లేని సమయంలో నీళ్లు పోసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా అమలవుతున్న హరితహారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కనాటగానే సంబరం కాదని, అవి పెరిగి చెట్టవ్వడం ముఖ్యమన్నారు. కలెక్టర్లతో సమన్వయం కుదుర్చుకుని రాష్టవ్య్రాప్తంగా కార్యాచరణ తయారు చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ శాఖ పరిధిలోనూ ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని, వాటి బాధ్యతను ప్రభుత్వోద్యోగులు స్వీకరించాలన్నారు.