తెలంగాణ

పక్షంరోజుల్లో ప్రక్రియ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: జిహెచ్‌ఎంసి పాలక మండలి ఎన్నికలను హైకోర్టు విధించిన గడువులోపే పూర్తి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ వ్యవహరాల శాఖ ఎన్నికల ప్రక్రియ తతంగాన్ని కుదించింది. సాధారణంగా ఎన్నికలంటే నామినేషన్లు దాఖలు చేసిన నాటినుంచి పోలింగ్‌కు 45 రోజుల వ్యవధి ఉంటుంది. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల వ్యవధిలోనే జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు 1955 మున్సిపల్ చట్టంలో పలు సవరణలు చేసి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ అయిన తేదీనుంచి మూడురోజులపాటు నామినేషన్ల స్వీకరణ చేపట్టి, తర్వాత ఒకరోజు పరిశీలన, మరుసటి (సెలవుకాకుండా) రోజు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చేలా చట్టంలో సవరణలు చేసింది. తర్వాత ఏడు రోజులపాటు ప్రచారానికి అవకాశమిచ్చేలా చట్ట సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచారానికిచ్చిన గడువు ముగిసిన తర్వాత, ఒకటి రెండురోజుల సమయమిచ్చి ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ను ముగించాలని సర్కారు భావిస్తోంది. మేయర్‌ను ఎన్నికునే ప్రక్రియను సైతం ఈ పదిహేనురోజుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈక్రమంలో ఇప్పటికే ఈ మాసంలో నాలుగురోజులు గడిచిపోయింది, ఇక మిగిలింది మరో 26రోజులు. ఇందులో 15రోజుల్లో అంటే 5న నోటిఫికేషన్ జారీ చేస్తే 20లోపు, ఏడున జారీ చేస్తే 22లోపు ఎన్నికల ప్రక్రియ ముగిస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.