తెలంగాణ

సైబర్ నేరాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో దేశంలోనే తొలిసారిగా సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ, ఈ-కామర్స్ విధానాన్ని డిజిటలైజేషన్ చేయడం, ఈ-కామర్స్‌లో కొనుగోలుకు ప్రోత్సాహం తమ లక్ష్యమన్నారు. తెలంగాణ, ఆంధ్ర ఫ్యాప్సీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఈ-కామర్స్‌పై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా మాట్లాడారు. సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్న సైబర్ చట్టం ద్వారా ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్టవేస్తామన్నారు. బెంగళూరులో ఏర్పాటు కానున్న అమెజాన్ కేంద్రం తెలంగాణకు తరలి వచ్చిందని, ఇందుకు రాష్ట్రప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. దేశంలోనే ఐటి రంగంలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. మన దేశంలో ఈ-కామర్స్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, రిటైల్ రంగ వ్యాపారవేత్తలు ఈ రంగంలో సేవలు అందిపుచ్చుకోవాలన్నారు. తెలంగాణ, ఏపి ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోదీ మాట్లాడుతూ దేశ వాణిజ్య ప్రగతిని ఈ-కామర్స్ నిర్దేశిస్తుందన్నారు. అన్ని వస్తువులు ఏ సమయంలోనైనా ఈ-కామర్స్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. 2009నుంచి దేశంలో ఈ-కామర్స్ వృద్ధి 34 శాతం ఉందని సిఏజిఆర్ నివేదిక వెల్లడించిందన్నారు. 2014లో ఈ-కామర్స్ టర్నోవర్ 16.4 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఈ ఏడాదికి 22 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. ఈ సదస్సులో ఎస్‌టిపిఐ డైరెక్టర్ సివిడి రాంప్రసాద్, ఈ-కామర్స్ నిపుణులు పాల్గొన్నారు. ఈ-కామర్స్ డాక్యుమెంట్‌ను ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు.

చిత్రం... ఈ-కామర్స్‌తో వ్యాపార అవకాశాలపై డాక్యుమెంట్‌ను విడుదల చేస్తున్న ఐటి కార్యదర్శి జయేష్ రంజన్