రాష్ట్రీయం

సాగుపట్ల నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 15: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును రాష్ట్రం పట్టించుకోవడం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ విమర్శించారు. శుక్రవారం నగరానికి విచ్చేసిన మంత్రి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యత రాష్ట్రాలదేనన్నారు. 2017 మార్చిలోగా రైతులకు భూసార (స్వస్థత) కార్డులు జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి 40 కోట్లు విడుదల చేశామని, అయినా ప్రారంభించలేదన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. యూరియా కొరతను పరిష్కరించామని, ఎరువుల ధరలు తగ్గించి రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. అయతే, తగ్గించిన ధరలు అమలు చేయడం లేదన్న ఫిర్యాదులున్నాయని, ఈ విషయంలోనూ చర్యలు తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కేంద్రం ధ్యేయమని, ఈ విషయంలో ప్రధాని మోదీ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే పసల్ బీమా యోజన చేయించుకోవాలని సూచించారు.
యువ శాస్తవ్రేత్తలు శ్రమించాలి
ఇలాఉండగా రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రలో ఏర్పాటైన ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ అధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, వీటిలో జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఎన్‌ఎఎమ్) ముఖ్యమైన పథకమన్నారు. రైతులు వారి ఉత్పత్తులను ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ ద్వారా విక్రయించుకోవడానికి దేశవ్యాప్తంగా 585 రెగ్యులేటెడ్ మార్కెట్‌లతో ఉమ్మడి ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శాస్తవ్రేత్తల ముందు అనేక సవాళ్ళు ఉన్నాయంటూ, వాటిలో నీటి ఎద్దటి, భూసార క్షీణత, వాతావరణ మార్పు ప్రధానమైనవన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి కొత్త పరిశోధనలు చేయడం ఎంతైనా అవసరమని సూచించారు. యువ శాస్తవ్రేత్తలు శ్రమించి పని చేస్తే ఎంతటి క్లిష్టమైన సవాళ్ళనైనా ఎదుర్కొగలమన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
కోళ్ళ పరిశ్రమలో వృద్ధి
ఇలాఉండగా ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఇండియా 28వ వార్షిక సాధారణ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ కోళ్ళ పరిశ్రమలో వృద్ధిని కాపాడుకోవాలన్నారు. కోళ్ళ పరిశ్రమలో ప్రపంచశ్రేణి ప్రమాణాలను అందుకోవాలంటే ప్రైవేటు రంగం, ప్రభుత్వం, ఇతర సంబంధిత వర్గాలన్నీ కలిసి పని చేయాలని కోరారు. ప్రపంచ కోళ్ళ పరిశ్రమలో ఆశిస్తున్న వృద్ధికి ఆసియా, ఆఫ్రికాలలో పెరుగుతున్న డిమాండ్ కీలకం కాగలదన్నారు. దేశంలోని భూమి లేని సన్నకారు వ్యవసాయదారులకు, అసంఘటిత, కోళ్ళ పెంపక రంగం అనుబంధ ఆదాయాన్ని సంపాదించి పెట్టగల సత్తాను కలిగి ఉందన్నారు. అంతేకాకాకుండా గ్రామీణ ప్రాంతాల పేదలకు పోషకాహార సంబంధంమైన భద్రతను కూడా ఇది అందించగలుగుతుందన్నారు. కాబట్టి ఈ ఉప రంగం ఎంతో ముఖ్యమైందని, అయితే ఇది సంఘటిత రంగంతో పాటే మనగలిగే మార్గాలను అనే్వషించాల్సి ఉందని కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.