తెలంగాణ

టిఆర్‌ఎస్‌కు అనుబంధ పార్టీలుగా మారిన కాంగ్రెస్, బిజెపిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 15: తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్, బిజెపిలు అనుబంధ పార్టీలుగా మారాయని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక కాంగ్రెస్-బిజెపిల అవసరం తెలంగాణకు లేదని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నెంబర్-1 సిఎం అని బిజెపి సర్ట్ఫికేట్ ఇస్తోందని, ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. కెసిఆర్ నెం-1 ముఖ్యమంత్రి అని ఆ పార్టీ తేల్చి చెబితే ఇక తెలంగాణలో ఆ పార్టీతో పని ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. పని చేయకుండా ఫాం హౌస్‌లో కూర్చునే కెసిఆర్ నెంబర్-1 సిఎం ఎలా అవుతారో అర్థం కావడం లేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఐదు రూపాయల భోజనం అద్భుతమని, హరిత హారం బాగుందని ప్రశంసించారని ఆయన తెలిపారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి లేపితే తప్ప ఆ పార్టీ లేవలేని దీన స్థితిలో ఉందని రేవంత్ దుయ్యబట్టారు.