తెలంగాణ

చర్చలకు పిలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు కోరారు. చర్చలు జాప్యం చేస్తే మరింత మంది కార్మికులు బలవన్మరణం చేసుకుంటారని, దీంతో ఆయా కుటుంబీకులు అనాథలు అవుతారని జేఏసీ నేతలు సీఎంకు సూచించారు. గురువారం హైకోర్టులో ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ఇచ్చిన అబద్దాల అఫిడవిట్‌లపై హైకోర్టు తీవ్ర అసహనం చేయడం పట్ల జేఏసీ నేతలు స్పందించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం స్పందించి ఈనెల 11వ తేదీలోపు జేఏసీ నేతల్లి చర్చలకు పిలవాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఏదోవక నిర్ణయం వస్తుందని గురువారం జేఏసీ నేతలు ఎదురు చూశామన్నారు. అయితే, హైకోర్టుకు పదేపదే అధికారులు అబద్దాల నివేదికలు ఇవ్వడంతో కోర్టు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన హైద్రాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజలతో ఆర్టీసీ కుటుంబాలు చేపట్టిన మిలీనియం మార్చ్ విజయవంతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు, నిర్బంధాలు, అరెస్టులు చేసినా 9న మిలీనియం మార్చ్‌ను ఆపలేరన్నారు. సమ్మె చేపట్టి గురువారం నాటికి 34 రోజలు దాటిపోయిందన్నారు. శుక్రవారం ఉస్మానియా విద్యార్థుల జేఏసీ నేతలతో మిలీనియం మార్చ్‌పై చర్చలు జరుపుతామన్నారు. సమ్మెకు మద్దతుగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు ధర్నాలు విజయవంతం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. సమ్మెకు ప్రజల మద్దతు వస్తున్నందున సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాల రహదార్లలో జేఏసీ నేతల ఆధ్వర్యంలో వినూత్న నిరసనలు చేశామన్నారు. సీఎం మూడుసార్లు డెడ్‌లైన్లు పెట్టినా కార్మికులు విధుల్లో చేరలేదన్నారు. దీంతో కార్మికుల శక్తి ఏమిటో కేసీఆర్‌కు అర్థం అయ్యిందన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బాగ్‌లింగంపల్లిలో అఖిలపక్ష నేతల్ని అరెస్టు చేయడం ప్రభుత్వం పైశాచిక చర్యలకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా సీఎం తన మొండి వైఖరిని విడనాడాలన్నారు.