తెలంగాణ

మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 7: తమ సమస్యల పరిష్కారం కోసం గత 33 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మరోవైపు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అధికార టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతునిచ్చి బాసటగా నిలుస్తున్నాయి. గురువారం జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా అఖిలపక్ష నాయకులతో కలిసి ప్రదర్శనగా బయలుదేరి మిర్చియార్డులో గల రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. క్యాంపు కార్యాలయం ప్రధానద్వారం వద్దకు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో వ్యకాస జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులుతో పాటు మరో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు గేటుదాటి లోపలికి చొచ్చుకెళ్లగా క్యాంపు కార్యాలయంలో రక్షణా ఉన్న పోలీసులు అమాతంగా పైకెత్తి బయటకు తరలించారు. ప్రధానద్వారం వద్ద అఖిలపక్షం నాయకులు, ఆర్టీసీ కార్మికులు లోనికి చొచ్చుకెల్లేందుకు తీవ్రంగా యత్నించగా పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులతో పాటు మహిళ కండక్టర్‌లను సైతం నెట్టివేయడంతో ఇద్దరు మహిళ కండక్టర్‌లకు గాయాలైయ్యాయి. మహిళ కండక్టర్‌లను మహిళ పోలీసులు లేకుండా విధుల్లో ఉన్న పురుష సిబ్బందే అడ్డుకోవడం పట్ల మహిళ కండక్టర్‌లతో పాటు విపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో అదనపు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకోని ఆందోళన చేస్తున్న వారందరిని అరెస్ట్‌చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి మాట్లాడుతూ మహిళ కండక్టర్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచలేదన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సీపీఎం నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, చెరుకు యాకలక్ష్మి, జిల్లేపల్లి నర్సింహరావు, మేకనబోయిన శేఖర్, ధనియాకులు శ్రీకాంత్‌వర్మ, ఆర్టీసీ జేఎసీ నేతలు గుండు రమేష్, బీఆర్ కుమార్, బత్తుల సుధాకర్, ఎన్‌సీ సైదులు, శ్రీకంఠం, యాకమ్మ, రజిత, ఉప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్తున్న అఖిలపక్ష నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు