తెలంగాణ

ఆర్టీసీ ఆస్తులు అమ్మాలన్నదే కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 7: ఆర్టీసీ ఆస్తులను అమ్మాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా గురువారం మహబూబ్‌నగర్‌కు విచ్చేసిన ఆయన ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నాలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించిన మొదటి రోజే సీఎం కేసీఆర్ సెల్ప్ డిస్మీస్ అన్నాడని ప్రజలు ఆయనకు రాబోయే కాలంలో డిస్మీస్ చేస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సెల్ప్ డిస్మీస్ అనలేదని కేసీఆర్ కన్న కిరణ్‌కుమార్‌రెడ్డియే వ్యక్తిగతంగా మంచివాడని అన్నారు. ఆర్టీసీ కార్మికుల నుండి రాజకీయ పార్టీలను, ప్రజలను దూరం చేయాలని కుట్రపన్నారని కానీ ప్రజల మద్దతుతో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని కానీ కేసీఆర్ ఎత్తుగడలు విఫలమయ్యావని ఆయన పరాజయం పాలయ్యారని అన్నారు. ఎన్ని హెచ్చరికలు సీఎం చేసిన ఆయన హెచ్చరికలకు భయపడకుండా సమ్మె చేస్తున్న కార్మికుల ధైర్యం ముందు కేసీఆర్ ఓటమి చెందారని ఎద్దేవా చేశారు. వంద ఏళ్ల క్రితం అమలైన కెనాడా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. అవసరమైతే కొంతమంది కార్మికులపై కాల్పులు జరిపించి ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని భావించారని కానీ కార్మికుల దైర్యం ముందు అది అమలు చేయలేకపోయారని విమర్శించారు. చలో సరూర్‌నగర్ సమరభేరీని విచ్చిన్నం చేయాలని పన్నిన కుట్రను కూడా కార్మికులు తిప్పికొట్టారని అన్నారు. కేసీఆర్‌కు ఆయన భజనపరులకు నిన్నటి వరకు కాళేశ్వరం అక్రమ సంపాదనకు కేరాఫ్‌గా అయ్యిందని కానీ ఇప్పుడు కాళేశ్వరంపై కేంద్రం కనె్నయడంతో కేసీఆర్ దృష్టి ప్రస్తుతం ఆర్టీసీపై పడిందని ఆరోపించారు. ఆర్టీసీని నామరూపం లేకుండా చేయాలన్నదే కేసీఆర్ కల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని కాపాడేందుకు తెలంగాణ సమాజం, పౌరసమాజం కార్మికులకు మద్దతుగా నిలిచిందన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగాస్తారని అన్నారు. టీఎన్జీఓ నాయకులు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని కేసీఆర్‌కు భజనపరుగా మారవద్దని కోరారు. కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్న కేసీఆర్‌కు హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కోర్టు చివరగా సీఎస్‌ను. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండిని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని బోనులో నిలబెట్టడం అంటే తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా రాష్ట్రం పరువు పోకముందే హైకోర్టు సూచనలను పరగణంలోకి తీసుకుని తక్షణమే ఆర్టీసీ జేఎసీ నాయకులతో చర్చలు జరపాలన్నారు. ఆర్టీసీ జేఎసీ నేతలు రవిందర్‌రెడ్డి,జీఎల్‌గౌడ్, సాయిరెడ్డి, బసప్ప, చిట్టెమ్మ పాల్గొన్నారు.

*చిత్రం... ఆర్టీసీ కార్మికుల ధర్నాలో ప్రసంగిస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ