తెలంగాణ

శుద్ధీకరణతోనే రెవెన్యూ వివాదాలకు ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, నవంబర్ 7: రెవెన్యూ శుద్ధీకరణే భూవివాదాలకు ఆజ్యం పోసిందని, అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన సీఎం కేసీఆర్ అనాలోచిత విధానమే అని కాంగ్రెస్ సీనియర్ నేత పట్ట్భద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏదో నూతన ప్రకియ చేపట్టినట్లు రెవెన్యూశుద్ధీకరణను తెరపైకి తెచ్చిందని దీంతోనే రెవెన్యూపై వివాదాలు పెరిగాయని అన్నారు. అనుభవ దారుడు ఏళ్ల తరబడి ఉన్న యాజమాన్య హక్కుదారుడిని ప్రోత్సహించే విధంగా ఉండడంతో బేరసారాలు మొదలయ్యాని అన్నారు. సీఎం అనాలోచిత విదానాన్ని కప్పిపుచ్చుకోవాడానికే రెవెన్యూశాఖను బాధ్యత ఆపాదించి వారికి అవినీతిని అంటగట్టిందని అన్నారు. ధర్మగంట పేరుతో అధికారులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి హింసను ప్రేరేపించేలా రెచ్చెగొట్టే వాఖ్యలు సీఎం కేసీఆర్ చేశారన్నారు. చట్టాని ఉల్లంఘించే అధికారం ఎవరికి లేదని తప్పుచేస్తే క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని, రెచ్చగొట్టే విధానం సరికాదని ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అని ప్రశ్నించారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఘటనపై న్యాయ విచారణ చేయించి వాస్తవాలు బయటపెట్టాలని, ఈ సంఘటనకు భాద్యులైన, ప్రేరేపితులను శిక్షించినపుడే తహశీల్దార్ విజయారెడ్డికి సరియైన న్యాయం చేసినట్లని అన్నారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, సమాజంపై ఉందన్నారు. మియాపూర్ భూకుంభకోణం, నరుూం భూ దోపిడీ మీ ప్రభుత్వ ఆధీనంలో లేదా అన్నారు. తహశీల్దార్ విజయారెడ్డి మృతి ఘటన అమానవీయం అని, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. తహశీల్దార్ విజయారెడ్డి మృతిపై జ్యూడిషియల్ ఎంక్వైరి చేపట్టి వాస్తవాలు బయటపెట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ నేత బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, గిరి నాగభూషణం, మ్యాదరి అశోక్, గుంటి జగదీశ్వర్, మసర్తిరమేష్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి