తెలంగాణ

గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జయకేతనం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, నవంబర్ 7: గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేయడం తధ్యమని, జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ పునాదే రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ సమాధి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ కెనాల్ వద్ద నూతనంగా నిర్మించనున్న బీజేపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రదాని నరేంధ్రమోడీ, అమిత్‌షా నాయకత్వంలో 11 కోట్ల సభ్యత్వంతో దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీగా బీజేపీ ఆవిర్బవించిందన్నారు. ప్రధాని, హోంమంత్రి బీజేపీకి కృష్ణార్జునులని అన్నారు. వారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం, సముచిత స్థానం దక్కుతుందని పేర్కొన్నారు. నేనే అసలైన హిందువని కేసీఆర్ విర్రవీగుతున్నారని అందుకే ఉత్తర తెలంగాణ ప్రజలు కరీంనగర్‌లోని మాటకు నిజమైన హిందువులను గుర్తించి ఓట్లు వేసి హిందువులని చెప్పుకునే కేసీఆర్‌కు కర్రుకాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసే యజ్ఞయాగాలు అసూర యాగాలని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పట్ల పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం అన్నట్లుగా వ్యవహరిస్తున్న పాశవిక తీరు, ప్రభుత్వ వైఖరి హేయమన్నారు. ప్రజలను ఇబ్బందులను గురి చేస్తున్న పార్టీ ప్రభుత్వం టీఆర్‌ఎస్ అయితే ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రేస్ పార్టీ అని విమర్శించారు. ఓ చేతిలో బీజేపీ జెండా మరో చేతిలో మోడీ ఎజెండాతో ముందుకు సాగి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాషాయపు జెండాను ఎగురవేసే విధంగా ప్రతి వార్డు నుంచి ఒకరు పోటీచేసి పురపాలకాలపై కాషాయజెండాను ఎగురవేయాలని కమలనాథులకు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో జగిత్యాల ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన ఆయన కార్మికులు మనోనిబ్బరంతో ఉండాలని సూచించారు. బీజేపీ ఆర్టీసీ సమ్మెకు అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, జిల్లా ఉపాద్యక్షుడు బాజోజి భాస్కర్, రాష్ట్ర పైనాన్స్ చైర్మన్ పైడిపెల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవిందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వూట్కూరి అశోక్‌రెడ్డి, జిల్లా మహిళ అధ్యక్షురాలు అరవ లక్ష్మి, నాయకులు ఎసిఎస్ రాజు, అన్‌కార్ సుధాకర్, సీపెల్లి రవిందర్, కృష్ణహరి, మ్యాన మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...బీజేపీ జిల్లా కార్యాలయ భవనానికి శంకుస్థ్ధాపన చేస్తున్న లక్ష్మణ్