తెలంగాణ

జీహెచ్‌ఎంసీ బిల్లుకలెక్టర్ ఉద్యోగాల ప్రాధమిక ఎంపిక జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: జీహెచ్‌ఎంసీ పరిధిలోని బిల్లు కలెక్టర్ ఉద్యోగాలకు అర్హులైన ప్రాధమిక అభ్యర్ధుల జాబితాను విడుదల చేసినట్టు టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన నిర్వహించిన ఎంపిక పరీక్ష ఆధారంగా ఈ జాబితాను రూపొందించామని, వీరందరి సర్ట్ఫికేట్ల పరిశీలన నవంబర్ 15 నుండి మొదలవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే తెలుగు మీడియం పీఈటీ పోస్టులకు సర్ట్ఫికేట్ల పరిశీలన నవంబర్ 14 నుండి మొదలవుతుందని కమిషన్ పేర్కొంది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 71 మందిని ఎంపిక చేశామని ఆ ప్రకటనలో వివరించారు. ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గత ఏడాది అక్టోబర్ 7న నిర్వహించిన లిఖిత పరీక్ష ఫలితాల ఆధారంగా అభ్యర్ధుల జాబితాను రూపొందించామని, వారికి సైతం త్వరలో సర్ట్ఫికేట్ల పరిశీలన ఉంటుందని ఆ నోటిఫికేషన్ కోసం ఎప్పటికపుడు కమిషన్ వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు. కాగా బెవరేజెస్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (గ్రేడ్-2), అసిస్టెంట్ సోర్సు ఆఫీసర్ (గ్రేడ్-2), డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-2) పోస్టులకు ఈ నెల 15వ తేదీ నుండి సర్ట్ఫికేట్ల పరిశీలన ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఆర్ధికశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఈనెల 18వ తేదీ నుండి సర్ట్ఫికేట్ల పరిశీలన ఉంటుందని కమిషన్ వేరొక ప్రకటనలో తెలిపింది.
రెండో శనివారాలు పనిచేయాల్సిందే
ఆర్టీసీ సమ్మె కారణంగా గతంలో సెలవులు పొడిగించడంతో శనివారాలు, రెండో శనివారాలు పనిచేయాలని నిర్ణయించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. ఈ మేరకు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు ఇచ్చామని, ఆ ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని ఆయన వివరించారు. కాగా లాంగ్‌మెమో అత్యవసరమైన వారు ఇమెయిల్ ఇస్తే అలాంటి వారికి వెంటనే లాంగ్‌మెమోలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మరో పది రోజుల్లో అందరికీ లాంగ్‌మెమోలు అందిస్తామని ఆయన వెల్లడించారు.