తెలంగాణ

ఆర్టీసీ ప్రైవేటుపరం కుట్రలు నెరవేరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ ఆస్తులపై కనే్నసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు రాష్ట్ర రోడ్డురవాణా సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. అందులో భాగంగానే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పిలిచి చర్చించాల్సింది పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వారి పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ వారి ఉద్యోగాలపై వేటు వేయడమేగాక, జీతాలివ్వక వేధిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. సామాన్యుడి రవాణా సాధనంగా పేరుగాంచిన ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు, వారి పోరాటానికి మద్దతు ఇస్తోన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతోందని, కోర్టులు మొట్టికాయలు వేసినా, ఆర్టీసీ కార్మికులు అలుపెరుగకుండా ఉద్యమించినా, బస్సులు లేక ప్రజలు అనేక కష్టాలకు గురవుతున్నా సీఎంకూ , టీఆర్‌ఎస్ ప్రభుత్వానికీ నిమ్మకు నీరెత్తినట్టుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొద్దునిద్ర పోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు నవంబర్ 9న హైదరాబాద్ ట్యాంకుబండ్‌పై ఆర్టీసీ జేఏసీ నిర్వహిస్తోన్న మిలియన్ మార్చ్‌కు బీజేపీ తెలంగాణ సంపూర్ణ మద్దతు ఇస్తోందని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి 35 రోజులుగా ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాలని కోరారు.
ఆర్టీసీ ఉల్లంఘన
ఆయిల్ కంపెనీలతో చేసుకున్న అవగాహన ఒప్పందం విషయంలో ఆర్టీసీ ఉల్లంఘించిందని, కనుక డీలర్‌షిప్‌ను రద్దు చేసి ఆర్టీసీ సిబ్బందికే ఆ బాధ్యతలు అప్పగించాలని బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, కమిటీ సభ్యుడు శ్యాంసుందర్ వరయోగి పేర్కొన్నారు. ఈ మేరకు వారు హెచ్‌పీసీఎల్ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీతో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని పూర్తిగా సమీక్షించాలని, సర్వీసు ప్రొవైడర్ పేరుమీద ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ఇచ్చిన డీలర్‌షిప్‌లను వెంటనే రద్దు చేయాలని, ఇంత వరకూ వచ్చిన కమిషన్ ఆదాయాన్ని ఆర్టీసీ ఖాతాలో జమ చేయాలని వారు కోరారు.