తెలంగాణ

‘గనేరియా’లో తెలంగాణ ఫస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: సుఖవ్యాధి గనేరియా వ్యాధిలో తెలంగాణ, సిఫిలిస్‌లో ఆంధ్రా అగ్రస్థానంలో నిలిచాయి. ఈ వివరాలను 2018లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెల్త్ బ్యూరో నిర్వహించిన జాతీయ హెల్త్ ప్రొఫైల్‌లో ప్రకటించింది. సుఖవ్యాధులు సిఫిలిస్, గనేరియా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విస్తరించాయి. 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణలో గనేరియా కేసులు అత్యధికంగా పురుషులు, మహిళలు కలిపి కేసులు నమోదయ్యాయి. 2018లో తెలంగాణలో గనేరియా వ్యాధి పురుషుల్లో 4824 కేసులు, మహిళల్లో 10,116 కేసులు కలిపి 14940 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద 55470 కేసులు నమోదయ్యాయి. పురుషుల కంటే మహిళలకు గనేరియా వ్యాధి సోకింది. దేశంలో 15,836 మంది పురుషులకు, 39,634 మంది మహిళలకు గనేరియా వ్యాధి వచ్చినట్లు హెల్త్ బ్యూరో పేర్కొంది. ఆంధ్రాలో గనేరియా వ్యాధి పురుషుల్లో 3197 మందికి, మహిళల్లో 9287 మందికి సోకింది. మొత్తం 12,484 కేసులు ఏపీలో రిపోర్టయ్యాయి. మరో సుఖవ్యాధి సిఫిలిస్ కేసులను విశే్లషిస్తే 2018లో ఆంధ్రాలో 1676 మంది పురుషులకు, 2393 మంది మహిళలకు కలిపి 4069 మందికి సోకింది. ఈ వ్యాధి దేశంలో ఎక్కువగా ఆంధ్రాలో విస్తరించినట్లు హెల్త్‌బ్యూరో పేర్కొంది. తెలంగాణలో 721 మంది పురుషులకు, 733 మంది మహిళలకు కలిపి 1454 మందికి సిఫిలిస్ వ్యాధి బారినపడినట్లు బ్యూరో పేర్కొంది. దేశం మొత్తం మీద 15,995 మందికి ఈ వ్యాధి సోకింది.
రాబిస్ వ్యాధి వల్ల ఆంధ్రాలో 12 మంది, పశ్చిమబెంగాల్‌లో 33 మంది, ఢిల్లీలో11 మంది, కర్నాటకలో 19 మంది మరణించారు. దేశం మొత్తం మీద 2018లో రాబిస్ వల్ల 110 మంది మరణించారు. ఇందులో 83 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. మలేరియా జ్వరం కూడా పంజా విప్పింది. ఆంధ్రాలో 2016లో 23,613 కేసులు, 2017లో 16,972 కేసులు, 2018లో 6,034 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 2016లో 3,512 కేసులు, 2017లో 2,688 కేసులు, 2018లో 1,787 కేసులు రిపోర్టయ్యాయి. దేశం మొత్తం మీద 2017లో 8,44,558 మలేరియా జ్వరాల కేసులు, 2018లో 3,99,134 కేసులు నమోదయ్యాయి. మెనిన్‌జోకోకల్ మెనింజిటిస్ వల్ల 2018లో ఆంధ్రాలో 758 కేసులు నమోదు కాగా, 45 మంది మరణించారు. తెలంగాణలో ఈ కేసులు కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయి. దేశం మొత్తం మీద 3382 మందికి ఈ వ్యాధి సోకగా, 152 మంది మరణించారు. న్యూమోనియా అనే ప్రాణాంతకమైన శ్వాసకోశ సంబంధ వ్యాధి కూడా ప్రమాదకరంగా పరిణమించింది. దేశం మొత్తం మీద 9,28,485 కేసులు నమోదు కాగా, 4,213 మంది మరణించారు. తెలంగాణలో 2018లో 3343 మంది పురుషులకు, 3222 మంది మహిళలకు న్యూమోనియా సోకగా, ఇద్దరు మరణించినట్లు రిపోర్టయంది. ఆంధ్రాలో పురుషులకు 20,203 మందికి, 17,546 మంది మహిళలకు కలిపి 37,749 మందికి న్యూమోనియా బారిన పడగా, 365 మంది మరణించారు. దేశం మొత్తం మీద పశ్చిమబెంగాల్‌లో 2,66,545 న్యూమోనియా కేసులు నమోదు గాగా, 660 మంది మరణించారు.