తెలంగాణ

ధనిక రైతులకు రాష్టమ్రే చిరునామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్తాబాద్, నవంబర్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలకు తరలించి, బీడుభూముల్ని సస్యశ్యామలం చేసి, రాష్ట్రాన్ని ధనిక రైతులకు చిరునామాగా తీర్చిదిద్దుతామని, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణాపూర్, తిమ్మాపూర్, అక్కపల్లి గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు, అల్మాస్‌పూర్‌లో గౌడ సంఘ భవనానికి శుక్రవారం ప్రారంభోత్సవం చేసిన సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తాము రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తున్నామని, అన్నదాత సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రభుత్వం బాసటగా ఉందనడానికి కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలే నిదర్శనమని పేర్కోన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి పెట్టుబడిగా రైతుబంధు, రైతు కుటుంబానికి ధీమాగా రైతు బీమా, రుణమాఫీ, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, మరయంత్రాలు, ట్రాక్టర్లు అందిస్తున్నదని అన్నారు. రైతు సంక్షేమ పథకాల అమలుతో వస్తున్న సత్ఫలితాల్ని మనం ఇప్పుడూ చూస్తున్నామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెట్ట ప్రాంతం కోనసీమగా మారిందన్నారు. సాగు, తాగు నీరు మెరుగుపడటంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని, అనుబంధ రంగాల అభివృద్ధి జరుగుతుందని, కులవృత్తులకు పూర్వవైభవం వస్తుందని, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు వసతితో కూడిన నాణ్యమైన విద్య అందించడానికి 700 గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆయా గురుకులాల్లో 2.50 లక్షల మంది పేదపిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారని అన్నారు. ఒక్కో విద్యార్థిపై ఏటా ఒక లక్ష రూ.లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని చెప్పారు. మా బాస్‌లు గల్లీ ప్రజలేనని, పేద ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు ద్విగుణికృత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విధాల తిప్పలు పెట్టినా ప్రజలు అండగా ఉండగా కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యే లేదని పేర్కోన్నారు. ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనులు చేస్తే పేద ప్రజలు సంతోషంగా ఉంటారో, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయో ఆలోచించి ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైరపర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, కేడీసీసీబి ఉపాధ్యక్షుడు వుచ్చిడి మోహన్‌రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి, మాజీజడ్పీటీసీ తోట ఆగయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.